భారత్ తో రెండవ టెస్టులో 10 కి 10 వికెట్లు తీసిన న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్

India vs New Zealand 2nd Test: Ajaz Patel 3rd Bowler To Take 10 Wickets In An Innings,Ajaz Patel,Ajaz Patel 3rd Bowler,India vs New Zealand 2nd Test,India vs New Zealand 2nd Test,India vs New Zealand Test Day2,Ajaz Patel 3rd Bowler To Take 10 Wickets In An Innings,India vs New Zealand 2nd Test Updates,India vs New Zealand 2nd Test Match,India Vs New Zealand 2nd Test 2021,Mango News,Mango News Telugu,India Vs New Zealand,India Vs New Zealand 2nd Test,India Vs New Zealand 2nd Test Toss,India Vs New Zealand 2nd Test Updates,India Vs New Zealand 2nd Test Day,India Vs New Zealand Live Cricket,India Vs New Zealand Updates,India Team Update,India Vs New Zealand 2nd Test Team Updates,India And New Zealand 2nd Test In Mumbai,India vs New Zealand 2nd Test Match Updates,India Vs New Zealand Live,India Vs New Zealand Live Updates,Live Cricket,Cricket,Cricket Live,Test Cricket,Test Cricket Match,India Cricket,INDIA Vs NZ Live,India Vs NZ,India Vs NZ 2nd Test Match,IND Vs NZ 2021,IND Vs NZ,India vs New Zealand Cricket,BCCI,#INDvNZ

ఇండియాతో జరుగుతున్న రెండవ టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ స్పిన్ బౌలర్ అజాజ్ పటేల్ ప్రపంచ రికార్డు సాధించాడు. 10 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేసాడు. భారత జట్టులోని అన్ని వికెట్లను అజాజ్ పటేల్ నేలకూల్చాడు. దీంతో టెస్ట్ మ్యాచ్ లో ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన 3వ బౌలర్ గా నిలిచాడు. నిన్న 4 వికెట్లతో మెరిసిన అజాజ్ ఈ రోజు మిగిలిన అన్ని వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో భారత జట్టు 325 పరుగులకు అల్ అవుట్ అయింది. భారత జట్టులో మయాంక్ అగర్వాల్ 150 పరుగులు చేసాడు.

1956 లో ఇంగ్లాండ్ బౌలర్ జిమ్ లేకర్ ఆస్ట్రేలియాపై మొదటిసారిగా 10 వికెట్ల ప్రదర్శన చేసాడు. 4 దశాబ్దాల తర్వాత 1999 లో భారత స్పిన్ బౌలర్ అనిల్ కుంబ్లే పాకిస్తాన్ పై మరలా ఈ ఫీట్ చేసాడు. 22 సంవత్సరాల తర్వాత మరలా ఇప్పుడు న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ మరోసారి 10 వికెట్లు సాధించి వారి సరసన నిలిచాడు. శతాబ్దాల చరిత్ర కలిగిన క్రికెట్ ఆటలో ఇప్పటివరకు కేవలం ముగ్గురు బౌలర్లు మాత్రమే ఈ ఫీట్ సాధించారంటేనే ఇది ఎలాంటి అద్భుతమైన ప్రదర్శనో అర్ధం అవుతుంది. కాగా, అజాజ్ పటేల్ న్యూజిలాండ్ బౌలర్ అయినప్పటికీ అతనిలో భారత మూలాలు ఉండటం విశేషం. కొన్ని సంవత్సరాల క్రితం వారి కుటుంబం ఇండియా నుంచి న్యూజిలాండ్ కి వలస వెళ్ళింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 3 =