ఫిలిప్పీన్స్ ను అతలాకుతలం చేసిన తుఫాన్

Super Typhoon Rai, Dozens feared in Philippines,Typhoon Rai, Philippines,Typhoon ,Super Typhoon Hits Philippines,Super Typhoon Rai wreaks havoc ,Super Typhoon Rai Hits the Philippines,powerful typhoon in Philippines,Philippines,powerful typhoon batters Philippines,Super Typhoon Hits Philippines,PhilippinesTyphoon Rai,Super Typhoon Rai Hits Philippines As Worse

ఫిలిప్పీన్స్ లో రాయ్ తుఫాన్ అల్లకల్లోలం సృష్టించింది. పెనుగాలులు, భారీ వర్షంతో రాయ్ తుఫాన్ దేశం పై విరుచుకుపడింది. భారీ కెరటాలు తీరా ప్రాంతాలను ముంచేసాయి. చాలాచోట్ల చెట్లు, ఇళ్ళు, భవనాలు కూలిపోయాయి. గాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో దేశం మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోయింది. అనేకచోట్ల ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రాష్ట్రాలు పూర్తిగా నీట మునిగాయి. వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వేలమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. భారీ వర్షం వలన సహాయకచర్యలకు ఆటంకం కలుగుతోంది.

సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో తుఫాన్ ప్రభావం అధికంగా ఉంది. ప్రస్తుతం తుఫాన్ తీరం దాటి దక్షిణ చైనా వైపుగా సాగుతోందని అధికారులు వెల్లడించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సుమారు 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వారు తెలియజేశారు. రాయ్ తుఫాన్ కారణంగా గంటకు 270 కే.మీ. వేగంతో గాలులు వీచాయని చెప్పారు. భారీ వర్షానికి ఈ గాలులు కూడా తోడై పెను విపత్తు సంభవించిందని తెలిపారు. ఈ దశాబ్దంలోనే పెను విపత్తుగా దీనిని భావిస్తున్నారు. జరిగిన నష్టాన్ని అధికారులు ఇప్పటికీ అంచనా వేయలేకపోతున్నారు. ఈ తుఫాన్ ధాటికి చాలా ప్రాణ నష్టం జరిగినట్లు తెలియవస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + two =