పౌరసత్వ సవరణ చట్టంపై ఢిల్లీలో ఉద్రిక్తం

#AligarhMuslimUniversity, #AMUprotest, #CAAProtests, Anti-CAA Protest Turns Violent, Citizenship Amendment Act 2019, Jamia University Campus In Delhi, latest political breaking news, Mango News Telugu, Maulana Azad National Urdu University, national news headlines today, national news updates 2019, National Political News 2019, Protests Against Citizenship Amendment Act

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పాటు పశ్చిమబెంగాల్, అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో ఆదివారం నాడు పలు చోట్ల నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. ప్రధాన నగరాలు, పట్టణాలలో విద్యార్థులు, ప్రజలు ఉధృతంగా నిరసన ప్రదర్శనలు చేపట్టడంతో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని జామియా ఇస్లామియా వర్సిటీలో విద్యార్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో రణరంగ వాతావరణం ఏర్పడింది. యూనివర్సిటీలో విద్యార్థులు భారీ నిరసన తెలుపడంతో పోలీసులు క్యాంపస్‌లోకి దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రాళ్లదాడి జరగడంతో పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘర్షణలో అనేక మంది విద్యార్థులకు గాయాలవ్వగా, ముగ్గురు పోలీసులు కూడా గాయపడ్డారు. జామియా వర్సిటీలో ఉద్రిక్తత తీవ్రరూపం దాల్చిన సమయంలోనే, బయట జరిగిన హింసాత్మక ఘటనల్లో కొందరు ఆందోళనకారులు మూడు బస్సులకు నిప్పు పెట్టారు. జామియా వర్సిటీ విద్యార్థులు చేపడుతున్న నిరసనకు మద్దతుగా జేఎన్‌యూ విద్యార్థులు తరలివచ్చారు. ఢిల్లీలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆదివారం నిరసనలో భాగంగా జామియా వర్సిటీలో అరెస్ట్ చేసిన 50 మంది విద్యార్థులను సోమవారం తెల్లవారుజామున విడుదల చేశారు.

మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) లోనూ ఆందోళనలు చెలరేగాయి. విద్యార్థుల నిరసన నేపథ్యంలో పోలీసులు భాష్పవాయువు ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ముందస్తు చర్యల్లో భాగంగా జనవరి 5వరకు జరగనున్న పరీక్షలను రద్దు చేసి, యూనివర్సిటీకి సెలవులు ప్రకటించారు. అలాగే ఢిల్లీలో జామియా ఇస్లామియా యూనివర్సిటీలో జరిగిన లాఠీఛార్జిని వ్యతిరేకిస్తూ, హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ(ఎంఏఎన్ యూయూ)లో విద్యార్థుల ఆందోళనకు దిగారు. విద్యార్థులు యూనివర్సిటీ ప్రధాన గేట్ వద్ద చేరుకొని ఢిల్లీ పోలీసులకు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితుల దృష్ట్యా ఎగ్జామ్స్ ని బహిష్కరిస్తున్నామని, వాయిదా వేయాల్సిందిగా కోరారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ముర్షీదాబాద్‌లో ఐదు ఖాళీ రైళ్లకు ఆందోళన కారులు నిప్పుపెట్టడంతో నిరసనలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్‌ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తునట్టుగా ప్రకటించారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + two =