ఏ క్షణమైనా వైసీపీ నాలుగో జాబితా విడుదలయ్యే అవకాశం

Any Moment The Fourth List Of Ycp Is Likely To Be Released, Fourth List Of Ycp Is Likely To Be Released, Fourth List Of Ycp, Ycp List Is Likely To Be Released, Ycp, Ap, Forth List, Ap Elections, Latest Ycp Fourth List News, Ycp Fourth List News Update, Ycp Fourth List, Andhra Pradesh, Ap Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
YCP, AP, Forth list, AP Elections

రెండోసారి సీఎం కుర్చీ దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రత్యర్థి పార్టీలు ఎన్ని వ్యూహాలు పన్నినప్పటికీ.. అంతకు మించిన వ్యూహాలతో ముందుకు కదులుతున్నారు. అన్ని పార్టీలకంటే ముందే తమ అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. ఇప్పటికే మూడు జాబితాలను ప్రకటించేశారు. 50 అసెంబ్లీ స్థానాలకు.. 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇక త్వరలో నాలుగో జాబితాను విడుదల చేసేందుకు జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు.

ఇప్పటికే నాలుగో జాబితాకు సంబంధించి అభ్యర్థులను జగన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో దాదాపు ఎంపీ అభ్యర్థులే ఎక్కువగా ఉంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి మొత్తం తొమ్మిది పార్లమెంట్ నియోజకవర్గాలకు జగన్ అభ్యర్థులను ప్రకటించనున్నారని అంటున్నారు. ఈ జాబితాలో గుంటూరు, మచిలీపట్నం, నరసరావుపేట, కాకినాడ, రాజమండ్రి, బాపట్ల, రాజంపేట, ఒంగోలు, కడప స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈసారి కూడా చలమలశెట్టి సునీల్‌కు కాకినాడ ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. గుంటూరు నుంచి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును పోటీ చేయించనున్నారట. నరసరావుపేట నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన కొత్త వ్యక్తిని బరిలోకి దింపనున్నారట. ఇక బాపట్ల సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్‌ను ఈసారి పక్కకు పెట్టనున్నారట. ఆయన స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తారట. సురేష్‌ను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించే అవకాశం ఉందట. రాజమండ్రినుంచి డైరెక్టర్ వీవీ వినాయక్‌ను రంగంలోకి దింపాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారట.

ఇక కడప నుంచి సిట్టింగ్ ఎంపీ అవినాశ్ రెడ్డినే మరోసారి బరిలోకి దింపనున్నారట. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్‌ను ఈసారి పక్కకు పెట్టి ఆయన స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. రాజంపేట నుంచి పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని బరిలోకి దింపనున్నారట. ఇలా మొత్తం 9 పార్లమెంట్ స్థానాలతో పాటు.. మరికొన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారట. ఏ క్షణమైనా వైసీపీ నాలుగో జాబితా వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఆ జాబితాపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =