హెచ్‌ఆర్‌ఏ విషయంలో ఆ విషయం తెలుసా?

Are you an Income Tax Payer, Income Tax Payer, HRA Allowance, Specific Rules, As Per Tax Rules, Income Tax Act, General Statement, An Income Tax Payer, HRA, Latest Income Tax News, Income Tax News Updates, Income Tax Rules, Tax Payer, Mango News, Mango News Telugu
Are you an Income Tax Payer?

హెచ్‌ఆర్‌ఏ అంటే ఇంటి అద్దె అలవెన్స్ అనేది శాలరీలో ముఖ్యమైన భాగం. మీ బేసిక్ శాలరీలా కాకుండా హెచ్‌ఆర్‌ఏపై పూర్తిగా ట్యాక్స్ ఉండదు. . ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10 (13ఏ) ప్రకారం స్పెసిపిక్ రూల్స్, కండిషన్ల ఆధారంగా  హెచ్‌ఆర్‌ఏకు కొంత భాగం ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది.

అంటే  హెచ్ఆర్ఏలో కొంత భాగాన్ని ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఇన్కమ్‌గా పరిగణించకుండానే ఉంచుకోవచ్చు. నిజానికి ప్రతీ ఆదాయపు పన్ను చెల్లింపుదారులుకూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. హెచ్‌ఆర్‌ఏ , మీ ట్యాక్స్ ఫైల్ చేయడానికి ముందు మీరు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో అన్ని సంగతులు తెలుసుకోవడం చాలా ముఖ్యం.దీనివల్ల   మీరు ట్యాక్స్ రూల్స్  ప్రకారం డబ్బును చట్టబద్ధంగానే సేవ్ చేసుకోవచ్చు.

మీరు సెల్ఫ్ ఎంప్లాయి అయినా లేదా హెచ్‌ఆర్‌ఏ లేకుండానే శాలరీ  తీసుకుంటున్నట్లు అయితే  మీరు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్‌లోని సెక్షన్ 80జీజీని ఉపయోగించి.. ప్రయోజనాలను పొందవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్  యాక్ట్ సెక్షన్ 10-13ఏ కింద  కొన్ని మార్గాల్లో హెచ్‌ఆర్ఏకు మినహాయింపులను పొందవచ్చు

మీరు నాన్ మెట్రో నగరాల్లో నివసిస్తుంటే మీ బేసిక్ శాలరీలో హెచ్‌ఆర్ఏ 40 శాతం ఉండాలి.  చెన్నై, కోల్‌కత్తా,, హైదరాబాద్, న్యూఢిల్లీ, ముంబై వంటి మెట్రో సిటీల్లో నివసిస్తుంటే మీ బేసిక్ శాలరీలో 50 శాతం ఉంటుంది.

మీరు చెల్లించే రెంట్ మీ హెచ్‌ఆర్‌ఏ కంటే ఎక్కువగా ఉంటే మీ బేసిక్ శాలరీలో 10 పర్సంట్ తీసివేసిన తర్వాత మీరు చెల్లించిన రెంట్ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ కోసం ఏఏ పత్రాలు కావాలంటే..నెలకు రూ. 3,000 వరకు హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్‌ల కోసం ఒక జనరల్ స్టేట్మెంట్ న సరిపోతుంది. అదనపు ప్రూఫ్ అవసరం లేదు.

ఒకవేళ హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్ మంత్‌కు రూ.3,000 నుంచి రూ. 8,333 మధ్య ఉంటే మాత్రం .. మీరు తప్పనిసరిగా మీ హౌస్ ఓనర్ సంతకంతో రెంట్ స్లిప్లను అందించాలి. అలాగే  హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్ మంత్‌కు రూ. 8,333 కంటే ఎక్కువ ఉంటే రెంట్ రిసీట్‌తో పాటు హౌస్ ఓనర్ ‌కు పాన్ నంబర్ కూడా క్లెయిమ్ చేయాలి. రెంటల్ అగ్రిమెంట్ ఇచ్చినా సరిపోతుంది. ఒక వేళ హౌస్ ఓనర్‌కు  పాన్ నంబర్ లేకపోతే ఎందుకు పాన్ కార్డు లేదో  వివరిస్తూ ఒక పేపర్‌పై వాళ్ల దగ్గర నుంచి  డిక్లరేషన్‌ తీసుకోవాలి. డిక్లరేషన్లో హౌస్ ఓనర్​ చిరునామా, ఫోన్ నంబర్ ఉండాల్సి ఉంటుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − one =