ఆసియా కప్‌ 2022: 6వ సారి టైటిల్‌ గెలుచుకున్న శ్రీలంక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై ఘనవిజయం

Asia Cup 2022 Sri Lanka Beats Pakistan by 23 Runs in Final Match To Win Sixth Title, Asia Cup 2022 Final Sri Lanka Won, Asia Cup 2022 Final, Sri Lanka Win Their 6Th Title, Srilanka Vs Pakistan Final, Mango News, Mango News Telugu, India vs Pakistan Asia Cup 2022, Asia Cup 2022 Super 4, Srilanka vs Pakistan Highlights, Srilanka vs Pakistan, Srilanka vs Pakistan Asia Cup Highlights, Asia Cup 2022 Latest News And Updates, Asia Cup 2022, Asia Cup 2022 Finale

ఆసియా కప్‌ 2022లో సంచలనం నమోదైంది. టోర్నీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన శ్రీలంక టైటిల్‌ గెలుచుకుంది. ఆల్‌రౌండ్‌ షోతో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్లో పాకిస్థాన్‌పై ఘనవిజయం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక 23 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కుషాల్‌ మెండిస్‌ (0), ధనుష్క గుణతిలక (1), దసున్‌ షనక (2), నిసాంక (8), ధనంజయ డిసిల్వ (28) నిరాశపరిచారు. దీంతో ఒక దశలో లంక స్కోరు 5 వికెట్ల నష్టానికి 58 పరుగులుగా ఉంది. అయితే ఈ దశలో భానుక రాజపక్స చెలరేగి ఆడి అర్ధశతకంతో జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. రాజపక్స 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 71 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతడికి వణిండు హసరంగ (36; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌), చమిక కరుణరత్నె (14 నాటౌట్‌) మంచి సహకారం అందించారు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో ఆరు, ఏడో వికెట్‌కు 50+ భాగస్వామ్యాలు నమోదు చేసిన తొలి జట్టుగా శ్రీలంక నిలవడంలో భానుక రాజపక్స కీలక భూమిక పోషించాడు. దీంతో లంక పాక్‌ ముందు 170 పరుగుల టార్గెట్ ఉంచగలిగింది. ఇక పాక్ బౌలర్లలో హరీస్‌ రవుఫ్‌ మూడు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 171 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ 20 ఓవర్లలో147 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ (55) హాఫ్ సెంచరీ చేయగా, ఇఫ్తిఖార్‌ (32) పర్వాలేదనిపించాడు. అయితే వీరిద్దరూ మినహా మిగిలిన బ్యాట్సమెన్ అందరూ చేతులెతేయడంతో పాకిస్థాన్‌ 147 పరుగులకు పరిమితమైంది. శ్రీలంక బౌలర్ హసరంగ 17వ ఓవర్‌లో మ్యాజిక్ చేసాడు. క్రీజులో కుదురుకున్న రిజ్వాన్‌ సహా మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను పూర్తిగా లంక వైపుకు తిప్పేశాడు. ఇక మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన లంక బ్యాటర్ భానుకకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కగా హసరంగ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు దక్కించుకున్నాడు. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఎదురైన దారుణ పరాభవం తర్వాత శ్రీలంక యువ జట్టు చివరి మ్యాచ్ వరకూ పోరాడి వరుసగా ఐదు విజయాలతో ఆసియా చాంపియన్‌గా నిలవడం విశేషం. ఇక ఈ విజయం ద్వారా శ్రీలంక భారత్‌ (7) తర్వాత అత్యధికంగా ఆరోసారి ఆసియ కప్ టైటిల్‌ను గెలుచుకున్న జట్టుగా రికార్డ్ సృష్టించింది.

స్కోరు బోర్డు

శ్రీలంక: నిస్సాంక (సి) బాబర్‌ (బి) రౌఫ్‌ 8, కుశాల్‌ (బి) నసీమ్‌ 0, ధనంజయ (సి అండ్‌ బి) ఇఫ్తికార్‌ 28, దనుష్క (బి) రౌఫ్‌ 1, రాజపక్స (నాటౌట్‌) 71, షనక (బి) షాదాబ్‌ 2, హసరంగ (సి) రిజ్వాన్‌ (బి) రౌఫ్‌ 36, కరుణరత్నే (నాటౌట్‌) 14, ఎక్స్‌ట్రాలు 10, మొత్తం 20 ఓవర్లలో 170/6.

బౌలింగ్‌: నసీమ్‌ 4-0-40-1, హస్నైన్‌ 4-0-41-0, రౌఫ్‌ 4-0-29-3, షాదాబ్‌ 4-0-28-1, ఇఫ్తికార్‌ 3-0- 21-1, నవాజ్‌ 1-0-3-0.

పాకిస్థాన్‌: రిజ్వాన్‌ (సి) గుణ తిలక (బి) హసరంగ 55, బాబర్‌ (సి) మదుశంక (బి) మదుశన్‌ 5, ఫఖర్‌ (బి) మదుశన్‌ 0, ఇఫ్తికార్‌ (సి/సబ్‌ బండార) (బి) మదుశన్‌ 32, నవాజ్‌ (సి) మదుశన్‌ (బి) కరుణరత్నే 6, ఖుష్‌దిల్‌ (సి) తీక్షణ (బి) హసరంగ 2, ఆసిఫ్‌ (బి) హసరంగ 0, షాదాబ్‌ (సి) గుణతిలక (బి) తీక్షణ 8, రౌఫ్‌ (బి) కరుణరత్నే 13, నసీమ్‌ (సి) కరుణరత్నే (బి) మదుశన్‌ 4, హస్నైన్‌ (నాటౌట్‌) 8, ఎక్స్‌ట్రాలు 14, మొత్తం 20 ఓవర్లలో 147 ఆలౌట్‌.

బౌలింగ్‌: మదుశంక 3-0-24-0, తీక్షణ 4-0-25-1, మదుశన్‌ 4-0-34-4, హసరంగ 4-0-27-3, కరుణరత్నే 4-0-33-2, దనంజయ డిసిల్వా 1-0-4-0.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here