ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్, కుమారస్వామి భేటీ, త్వరలోనే సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ?

Karnataka Ex CM HD Kumaraswamy Meets Telangana Chief Minister KCR at Pragati Bhavan, HD Kumaraswamy Meets Telangana CM KCR , HD Kumaraswamy Meets CM KCR, Karnataka Ex-CM HD Kumaraswamy Meets CM KCR, HD Kumaraswamy Calls On CM KCR, Mango News, Mango News Telugu, Karnataka Ex CM HD Kumaraswamy , Telangana Chief Minister KCR , Pragati Bhavan , Hd Kumaraswamy Meets Kcr, KCR National Party, HD Kumaraswamy, Telangna CM KCR, TRS Party, Janata Dal , HD Kumaraswamy Janata Dal, CM KCR Latest News And Updates

హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో ఆదివారం నాడు జేడీఎస్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర, జాతీయ రాజకీయ పరిస్థితులు, దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ పోషించబోయే పాత్ర సహా పలు అంశాలపై సీఎం కేసీఆర్, కుమార స్వామి చర్చించారు. అలాగే జాతీయస్థాయిలో పార్టీ స్థాపించే ఆలోచనలను, సంబంధిత సిద్ధాంతాలు, విధివిధానాలు, పలు రాష్ట్రాల్లో తన పర్యటనల వివరాలను కూడా సీఎం కేసీఆర్ కుమారస్వామితో పంచుకున్నట్టు తెలుస్తుంది.

ఈ సందర్భంగా జాతీయ రాజకీయాల్లోకి రావాలని తనపై పెరుగుతున్న ఒత్తిడి, తెలంగాణ రాష్ట్రాన్నినడిపిస్తున్నట్టే దేశాన్ని కూడా నడిపించాలని, మోదీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలంటూ ప్రజలు కోరుకుంటున్న విషయాలను సీఎం కేసీఆర్ కుమారస్వామికి వివరించారు. ఇటీవల హైదరాబాద్ వచ్చి కలిసిన రైతు నేతలు కూడా తనను జాతీయ రాజకీయాల్లోకి కోరినట్టు తెలిపారు. ఇక తెలంగాణ పట్ల వ్యతిరేక వైఖరితో ఉన్న బీజేపీ పట్ల ప్రజల్లో పూర్తిస్థాయిలో విముఖత ఉందన్నారు. జాతీయ అజెండాపై ఏకాభిప్రాయం సాధించామని, త్వరలోనే జాతీయ పార్టీ రూపకల్పన చేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు సమాచారం.

ఇక సీఎం కేసీఆర్ తో భేటీపై కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి స్పందిస్తూ, “ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశాను. కర్ణాటకలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్ర సమస్యలపై ముఖ్యంగా చర్చించాము. జాతీయ రాజకీయ పార్టీలకు దీటుగా ‘సమాంతర రాజకీయ ఫ్రంట్’ నిర్మించాల్సిన అవసరం ఉందని, సీఎం కేసీఆర్ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. రైతులు, కూలీలు, దళితులు, సామాన్యులతో కూడిన కొత్త ఫ్రంట్‌కి నేను ఆయనకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చాను. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో మరియు విజయదశమి పండుగకు ముందు జాతీయ రాజకీయాల్లోకి వస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు. సీనియర్ నాయకుడు నా పట్ల చూపిన ఆప్యాయత, ఆతిథ్యం, ప్రేమ, సహృదయత నన్ను ఆకట్టుకుంది” అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాల్క సుమన్‌, రాజేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఇరువురు మధ్య భేటీ ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్‌ కుమారస్వామిని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − eleven =