ఒమిక్రాన్ వైరస్ విషయంలో నిర్లక్ష్యం వద్దు – ప్రపంచ ఆరోగ్య సంస్థ

Don't Underestimate The Omicron Virus, WHO Warns to All Countries, variant Omicron spreading faster than other variants, WHO Warns to All Countries, WHO, WHO Latest News, WHO Live Updates, world health organization, Omicron Virus, Omicron Virus Live Updates, Covid-19, Coronavirus, coronavirus india, Coronavirus Updates, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, All Countries, WHO Omicron Warning, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, omicron variant in India, omicron variant south africa, covid-19 new variant,

ఆసియాలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచన చేసింది. క్షేత్రస్థాయిలో కోవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని కోరింది. ఒమిక్రాన్ అంత ప్రమాదకరమైనది కాదని చెబుతున్నా.. అప్రమత్తత అవసరమని స్పష్టం చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్నిరకాల చర్యలను చేపట్టాలని డబ్ల్యూహెచ్ఓ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ తెలిపారు. ఒమిక్రాన్ ను తేలిగ్గా తీసుకుంటే.. తర్వాత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా అధికార యంత్రాంగాలు అప్రమత్తంగా వ్యవహరించాలి. మాస్కులు ధరించటం, చేతులు శుభ్రంగా కడగటం, భౌతిక దూరం పాటించటం.. తదితర నియమాలను కచ్చితంగా పాటించాల్సిందే.. అని ఖేత్రపాల్ సింగ్ సూచించారు. విస్తరిస్తున్న వాటిలో ఒక్క ఒమిక్రాన్ కేసులు మాత్రమే కాదాని.. అత్యంత ప్రమాదకరమైన డెల్టాతో పాటు ఇతర వేరియంట్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఒమిక్రాన్ ప్రభావం వల్ల ప్రమాదం లేదని వైద్యులు చెప్తున్నారని.. కానీ, మనకి ఈ విషయంలో నిర్లక్ష్యం వహించడం తగదని హెచ్చరించారు. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల అనుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోందని.. మరణాలు కూడా సంభవిస్తున్నాయని సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 10 =