కరోనా వ్యాక్సిన్ పంపిణీ, ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్‌

Covid-19 Vaccine Distribution: Centre will Conduct Dry Run in 4 States on December 28 And 29,Covid -19 Vaccine Dry Run On December 28 And 29,Assam, Andhra Pradesh, Gujarat, Punjab,Coronavirus,Covid-19 Vaccine Dry Run,Coronavirus Vaccine,Vaccination Corona,Corona Vaccine In India,Vaccine Training In India,Coronavirus Vaccination Training,Mango News,Mango News Telugu,Coronavirus,Dry Run For COVID-19 Vaccine Rollout In 4 States Next Week,Dry Run For Covid-19 Immunisation Drive In 4 States Next Week,Corona Vaccine Dry Run In Andhra Pradesh On December 28,Corona Vaccine Dry Run In Andhra Pradesh,Covid-19 Vaccine Dry Run

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ కోసం రాష్ట్రాలను సిద్ధం చేయడానికి మరియు ప్రణాళికాబద్ధమైన కార్యకలాపాల సంసిద్ధతను అంచనా వేయడానికి మొదటి దశలో నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్ (వ్యాక్సిన్ సన్నాహక కార్యక్రమం) నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. డిసెంబర్ 28, 29 తేదీలలో ఆంధ్రప్రదేశ్, అస్సాం, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలలో డ్రైరన్ నిర్వహించనున్నారు. ఈ రాష్ట్రాలలోని ఏవైనా రెండు జిల్లాల్లో జిల్లా ఆసుపత్రి, సిహెచ్‌సి/పిహెచ్‌సి, అర్బన్ సైట్, ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీ, గ్రామీణ ప్రాంతాలలోని హెల్త్ కేంద్రాలలో ఈ డ్రైరన్ చేపట్టనున్నారు.

రెండ్రోజుల పాటు జరిగే డ్రైరన్ లో వ్యాక్సిన్ ఇవ్వడం మినహా, పంపిణీకి సంబంధించి మిగిలిన అన్ని దశలను పరిశీలించనున్నారు. వ్యాక్సిన్ పంపిణీకి ముందుగానే క్షేత్రస్థాయిలో కో-విన్ వాడకాన్ని తనిఖీ చేయడం, ప్రణాళిక అమలు, రిపోర్టింగ్ మెకానిజమ్‌ల మధ్య అనుసంధానాలు, ప్రజలను అదుపుచేసే విధానం, అప్రమత్తత మరియు సవాళ్లను గుర్తించడానికి ఈ డ్రైరన్ ఉపయోగపడనుంది. మరోవైపు డ్రైరన్ కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే ఎంపిక చేసిన రాష్ట్రాలకు అందజేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + ten =