మహిళల టీ20 ప్రపంచకప్‌-2023: 15 మందితో కూడిన భారత్ జట్టు ఇదే, ఏపీ క్రీడాకారిణి అంజలి సర్వాణికి చోటు

BCCI Announces India Squad for ICC Women’s T20 World Cup 2023 and Tri-series in South Africa,BCCI Announces India Squad,ICC Women’s T20 World Cup,T20 World Cup 2023,Tri-series in South Africa,Mango News,Mango News Telugu,Icc Womens T20 World Cup 2022,Icc Womens T20 World Cup Qualifiers 2022,Icc Womens T20 World Cup Schedule,Icc Womens T20 World Cup Winners List,Icc Womens T20 World Cup 2023 Schedule,Icc Womens T20 World Cup 2022 Schedule,Icc Womens T20 World Cup 2023 Qualifier,Icc Womens T20 World Cup Winners List 2022,Icc Women's T20 World Cup Winners List,Icc Women'S T20 World Cup 2022,Icc Women's T20 World Cup Schedule,Icc Women's T20 World Cup Live Score,Icc Women's T20 World Cup 2023 Schedule,Icc Women's T20 World Cup 2021 Schedule,Icc Women's T20 World Cup Asia Region Qualifier,Icc Women's T20 World Cup 2022 Schedule,Icc Women'S T20 World Cup

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2023 సౌతాఫ్రికాలో జరగనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 10వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఎనిమిదో ఎడిషన్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌ కోసం 15 మందితో కూడిన భారత్ మహిళల జట్టును ఆల్-ఇండియా ఉమెన్స్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్టు బీసీసీఐ బుధవారం ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్ గా, స్మృతి మంధాన వైస్‌ కెప్టెన్‌ గా వ్యవహరించనున్నారు. ఈ 15 మంది జట్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువక్రీడాకారిణి అంజలి సర్వాణి కూడా చోటు దక్కించుకుంది. అలాగే చాలా రోజుల తర్వాత భారత జట్టులో శిఖా పాండే స్థానం సంపాదించింది. ఇక పూజా వస్త్రాకర్‌ని జట్టులో చేర్చుకోవడం ఆమె ఫిట్‌నెస్‌కు లోబడి ఉంటుందని బీసీసీఐ తెలిపింది.

ఐసీసీ టీ20 ప్రపంచకప్-2023 ఫిబ్రవరి 10, 2023న ప్రారంభం కానుండగా, భారత్ జట్టు ఫిబ్రవరి 12న పాకిస్థాన్‌ తో కేప్ టౌన్‌లో జరిగే మ్యాచ్ తో టోర్నమెంట్ ప్రారంభించనుంది. ఇంగ్లాండ్, వెస్టిండీస్‌, పాకిస్థాన్‌, ఐర్లాండ్‌లతో కూడిన గ్రూప్‌ 2లో భారత్ జట్టు ఉంది. గ్రూప్ దశ ముగిసే సమయానికి ఒక్కో గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్‌లో తలపడతాయని, అలాగే టీ20 ప్రపంచకప్ ఫైనల్ 2023, ఫిబ్రవరి 26న కేప్ టౌన్‌లో జరుగుతుందని తెలిపారు. కాగా టీ20 ప్రపంచకప్‌కు ముందు, భారత్ జట్టు 2023 జనవరి 19 నుండి సౌతాఫ్రికా, వెస్టిండీస్ తో ట్రై-సిరీస్ టోర్నమెంట్‌ను ఆడనుందని చెప్పారు. ఈ ట్రై-సిరీస్ కోసం కూడా 18 మందితో కూడిన భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది.

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2023 కోసం భారత్ జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవికా వైద్య, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్, అంజలి సర్వాణి, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గయాక్వాడ్, శిఖా పాండే.

రిజర్వ్‌లు: సబ్భినేని మేఘన, స్నేహ రాణా, మేఘనా సింగ్.

ట్రై సిరీస్ కోసం భారత్ జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), యాస్తికా భాటియా (వికెట్ కీపర్), జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవికా వైద్య, రాజేశ్వరి గయక్వాడ్, రాధా యాదవ్, రేణుకా సింగ్, మేఘనా ఠాకూర్, అంజలి సర్వాణి, శుష్మా వర్మ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, పూజా వస్త్రాకర్, సబ్భినేని మేఘన, స్నేహ రాణా, శిఖా పాండే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =