‘క్యాబ్‌’ అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేసిన బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ

BCCI Ex Chief Sourav Ganguly Files Nomination For The Second Stint as CAB President, BCCI Ex Chief Sourav Ganguly, Sourav Ganguly Files Nomination For CAB President, Second Stint as CAB President, Mango News, Mango News Telugu, Sourav Ganguly Latest News And Updates, CAB president Elections, Second Stint As CAB Chief, Sourav Ganguly, Ex-BCCI Chief, Withdraws From Cricket, Ganguly CAB Elections, CAB Presidential Elections, Cricket Association of Bengal

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడిగా పదవీకాలం ముగిసిన అనంతరం సౌరవ్ గంగూలీ తన తదుపరి అడుగులు వడివడిగా వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఆదివారం సౌరవ్ గంగూలీ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లోని క్యాబ్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. సౌరవ్ గంగూలీ స్థానంలో భారత మాజీ ఆటగాడు రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు, సౌరవ్ గంగూలీకి ఐపీఎల్ ఛైర్మన్ పదవిని ఆఫర్ చేయగా అతను తిరస్కరించాడు.

అయితే నిబంధల ప్రకారం గంగూలీ మరోసారి బీసీసీఐ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు అవకాశం ఉన్నా బోర్డులోని మెజారిటీ సభ్యులు అంగీకరించకపోవడంతో అతను తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే సొంత రాష్ట్రమైన బెంగాల్ లో క్యాబ్ పదవికి గంగులు ఆసక్తి కనబరిచారు. కాగా ‘క్యాబ్‌’ అధ్యక్షుడిగా గంగూలీ పోటీ చేయడం ఇది రెండోసారి. బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టకు ముందు ఆయన 2015 నుండి 2019 వరకు క్యాబ్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే గంగూలీకి బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో మంచి పట్టుంది. దీంతో ఆయన సులువుగా గెలిచే అవకాశాలున్నాయి. ఇక క్యాబ్‌ ఎన్నికలు అక్టోబర్ 31న జరుగనున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =