బీసీసీఐ కీలక నిర్ణయం, మాజీ క్రికెటర్లు, అంపైర్ల నెలవారీ పెన్షన్లు పెంచుతున్నట్టు ప్రకటన

BCCI Hikes Monthly Pensions of Former Cricketers and Umpires, BCCI Hikes Monthly Pensions of Former Umpires, BCCI Hikes Monthly Pensions of Former Cricketers, Former Cricketers and Umpires, Former Umpires, Former Cricketers, BCCI Hikes Monthly Pensions, BCCI Hiked Monthly Pensions of Former Cricketers and Umpires, BCCI Hiked Monthly Pensions of Former Umpires, BCCI Hiked Monthly Pensions of Former Cricketers, BCCI, Board of Control for Cricket in India, Cricket administrative body, Former Cricketers and Umpires Pensions News, Former Cricketers and Umpires Pensions Latest News, Former Cricketers and Umpires Pensions Latest Updates, Former Cricketers and Umpires Pensions Live Updates, Mango News, Mango News Telugu,

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం కీలక ప్రకటన చేసింది. మాజీ క్రికెటర్లు (పురుషులు, మహిళలు) మరియు మాజీ అంపైర్ల నెలవారీ పెన్షన్‌లను పెంచుతున్నట్లుగా బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 900 మంది మాజీ క్రికెటర్లు, అంపైర్లు ఈ ప్రయోజనాన్ని పొందుతారని తెలిపారు. ఇప్పటివరకు రూ.15 వేల పెన్షన్‌ పొందే వారు, ఇకపై నెలకు రూ.30,000, ఇప్పటివరకు రూ.22,500 పెన్షన్‌ పొందుతున్న వాళ్ళు ఇకపై రూ.45,000, రూ.30,000 పెన్షన్‌ వారికీ ఇకపై రూ.52,500, రూ.37,500 పెన్షన్‌ వారికీ రూ.60,000 మరియు రూ.50,000 వేల పెన్షన్‌ పొందేవారు ఇకపై రూ.70,000 అందుకుంటారని పేర్కొన్నారు.

పెన్షన్ల పెంపుపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ, “మా మాజీ క్రికెటర్ల ఆర్థిక శ్రేయస్సు చాలా ముఖ్యం. ఆటగాళ్లు లైఫ్‌ లైన్‌గా ఉంటారు మరియు బోర్డుగా వారి ఆట రోజులు ముగిసిన తర్వాత వారి పక్కన ఉండటం మా కర్తవ్యం. అంపైర్లు కూడా అన్ సంగ్ హీరోలు మరియు బీసీసీఐ వారి సహకారానికి నిజంగా విలువనిస్తుంది” అని అన్నారు. బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ, “మా మాజీ క్రికెటర్లకు లేదా ఇప్పుడున్న వారి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మరియు పెన్షన్ మొత్తాలను పెంచడం ఆ దిశలో ఒక అడుగు పడింది. సంవత్సరాలుగా అంపైర్లు అందించిన సహకారాన్ని బీసీసీఐ విలువైనదిగా పరిగణిస్తుంది మరియు భారత క్రికెట్‌కు వారు చేసిన శ్రద్ధతో కూడిన సేవలకు మా కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇది ఒక మార్గంగా భావిస్తున్నాం. 75% కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు 100 శాతం పెంపుతో మొత్తం 900 మంది సిబ్బంది ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందుతారు” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here