‘ఓం’పై నేపాల్‌కు ఎందుకంత ద్వేషం?

Why does Nepal hate Om,Nepal hate Om,Nepal Controversy,Nepal hate Om Removal of some words, dictionary of Nepal, dictionary,Mango News,Mango News Telugu,Why Nepalis Hate India,Anti India Sentiment in Nepal,The Paradox of the Nepali Mindset,Why Nepalis love to hate India,Indias Islamophobia Creeps Into Nepal,Intellectual Muslims Association of Nepal,Nepal hate Om Latest Updates,Nepal hate Om Live News,Nepal hate Om Live Updates

కొద్ది నెలలుగా నేపాల్ ప్రభుత్వం నేపాల్ అధికారిక నిఘంటువు నుంచి కొన్ని ప్రత్యేక పదాలను తొలగించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. నేపాల్ నిఘంటువు నుంచి తొలగించే పదాలలో ఒకటి ‘ఓం’అని తెలుస్తుంది. ఓం అనేది భారతదేశంలోనే కాదు ఇతర దేశాలలోనూ సనాతన ధర్మానికి చిహ్నంగా భావిస్తారు.

నిజానికి నేపాల్‌లో 2016వ సంవత్సరం నుంచి నేపాల్ అధికారిక డిక్షనరీని మార్చడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.తాజాగా ఇప్పుడు ఈ అంశంపై ఏకంగా నేపాల్‌ సుప్రీంకోర్టు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దీంతో నేపాల్‌ ప్రభుత్వం తీరుపై సనాతన ధర్మాన్ని నమ్ముతున్న నేపాలీ ప్రజలతో పాటు ఇతర దేశాలలో సనాతన ధర్మాన్ని నమ్ముతున్నవారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే నేపాల్ అధికారిక నిఘంటువు నుంచి ‘ఓం’పదాన్ని తొలగించే అంశం ఇప్పటిది కాదు. 2012 వ సంవత్సరం నుంచి కొనసాగుతూనే ఉంది. 2012లో నేపాల్‌లో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఉండేది. అప్పటి విద్యాశాఖ మంత్రి దీనానాథ్ శర్మ ఆదేశాలతో.. అధికారిక నిఘంటువులో మార్పులు చేసేందుకు ఒక కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా బుద్ధుడు, బ్రాహ్మణుడు మొదలైన వాటితో పాటు ఓం, శ్రీ.. వంటి కొన్ని పదాలను నిఘంటువు నుంచి తొలగించాలని నిర్ణయించారు.

సనాతన ధర్మంలో ‘ఓం’ అనే పదాన్ని పరమ శివుని చిహ్నంగా పరిగణిస్తారు.అంతేకాదు ఇతర దేవుళ్లకు ఓంకార నాదాన్ని జత చేసి.. కొలుస్తారు. ఓం అనే పదం చాలా పవిత్రమైనదని, శక్తివంతమైనదని ఎన్నో శాస్త్రాలలో , పురాణాలలో చెబుతారు. చాలా మంత్రాలు కూడా ‘ఓం’ అనే పదంతోనే ప్రారంభమవుతాయి.

నేపాల్ ప్రభుత్వం తీసుకున్న ఈ పదాల మార్పు నిర్ణయాన్ని ప్రభుత్వంలోని సంకీర్ణమైన సోషలిస్టు ఫ్రంట్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నేపాలీ కాంగ్రెస్ ఎంపీ శంకర్ భండారీ.. అయితే ఈ అంశంపైన నేపాల్ ప్రభుత్వాన్ని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నేపాల్ అధికారిక నిఘంటువు నుంచి ‘ఓం’ పదాన్ని తొలగించడం ఏకంగా సనాతన సంస్కృతిపై దాడి చేయడం వంటిదేనని శంకర్ భండారీ ఆరోపించారు. ఇది కేవలం పాశ్చాత్య దేశాల ప్రభావంతోనే జరుగుతున్న ఓ కుట్రగా శంకర్ భండారీ చెప్పుకొచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − three =