ఐఐటీ భూకంప నిపుణులు ఏమని హెచ్చరిస్తున్నారు?

What do IIT earthquake experts warn,IIT earthquake experts warn,What do IIT earthquake,Earthquake,Threat of more earthquakes, IIT earthquake experts warn,Tripura, NCR, Nepal, Delhi,Mango News,Mango News Telugu,IIT study warns of high damages,IIT earthquake experts Latest News,IIT earthquake experts Latest Updates,IIT earthquake experts Live News,Tripura Latest News,Tripura Latest Updates
What do IIT earthquake experts warn

ఉత్తరప్రదేశ్‌లోని గంగానదీ తీర ప్రాంతాల్లో ఉన్న సిటీలలో భవిష్యత్‌లో భారీ భూకంపాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు ఐఐటీ కాన్పూర్‌కు చెందిన భూకంప నిపుణులు. ఇటీవల త్రిపుర,ఎన్సీఆర్, నేపాల్, ఢిల్లీ ప్రాంతాల్లో నాలుగు భూప్రకంపనలు వచ్చి అక్కడి ప్రజలను భయబ్రాంతులకు గురవడంతో..తాజాగా అక్కడి పరిసరాలపై భూకంప నిపుణులు అధ్యయనం చేశారు. గంగా తీరం వెంట ఉన్న పట్టణ కేంద్రాలకు కూడా భవిష్యత్తులో మరింత శక్తివంతమైన భూప్రకంపనల ముప్పు ఉండే అవకాశాలు ఉన్నాయని భూకంప నిపుణులు చెబుతున్నారు.

భూకంపాల చారిత్రక నమూనా ప్రకారం.. భవిష్యత్తులో అది కూడా అతి త్వరలో చాలా బలమైన భూకంపాల బారిన పడే అవకాశం పొంచి ఉందని భూకంప నిపుణులు అంటున్నారు. గంగా తీరం వెంట ఉన్న సిటీల్లో ఎక్కువ శాతం ఇసుక భూభాగం ఉండటంతో.. భూకంపం సమయంలో అక్కడి భవనాలకు ఎక్కువ నష్టం జరిగే అవకాశముందని భూకంప నిపుణులు చెప్పారు.

గతంలో ఉత్తరాఖండ్‌లో 1505లో సంభవించిన అతిపెద్ద భూకంపం 8.3 తీవ్రతతో నమోదవగా.. 1934లో రిక్టర్ స్కేలుపై 8.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అలాగే నేపాల్‌లో 2015లో 7.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇలాంటి చారిత్రక డేటాలను పరిశీలించిన భూకంప నిపుణులు.. భూకంపాల సంభావ్యత గురించి వివరించారు. అతి త్వరలోనే భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా హెచ్చరిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని గంగానదీ తీర ప్రాంతాల్లో ఉన్న సిటీలలో రానున్న కాలంలో మరోసారి ఎక్కువ తీవ్రతతో కూడిన భూకంపం రావడం ఖాయమని, దాని ప్రభావం కూడా ఎక్కువగా ఉండటంతో అందరూ అప్రమత్తంగా ఉండటానికి సిద్ధం కావాలని భూకంప నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ భారీ భూకంపం ఎప్పుడు వస్తుందో చెప్పడం మాత్రం ఇప్పుడు చాలా కష్టమని అంటున్నారు. ఒక్క ఉత్తరాఖండ్‌లోనే 1505లో రిక్టర్ స్కేలుపై 8.3 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిందని..ఆ తర్వాత 1803లో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని గుర్తు చేశారు.

ఇలా ముఖ్యంగా ఉత్తరాఖండ్‌లో ఈ చారిత్రక భూకంపాల ఆధారంగా చూసుకుంటే..భవిష్యత్తులో ప్రతి 300 -500 ఏళ్లకు ఉత్తరాఖండ్ ఎక్కువ తీవ్రతతో కూడిన భూకంపనాలు రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ భూకంపాల వెనుక ఉన్న రీజన్‌ను వివరిస్తున్నారు. టెక్టోనిక్ ప్లేట్లపై భూమి ఉందని.. ఆ భూబి క్రింద ద్రవం ఉంటుందని.. ఈ ప్లేట్లు నిరంతరం కదులుతుంటాయని చెబుతున్నారు. ఈ ప్రభావం వల్లే భూకంపాలు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + fifteen =