హర్యానాలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర.. రాహుల్ గాంధీని కలిసిన క్రీడాకారులు దీపక్ నివాస్ హుడా, సావీటీ బూరా

Bharat Jodo Yatra Arjuna Awardee Deepak Niwas Hooda and Female Boxer Saweety Boora Meets Rahul Gandhi in Haryana,Bharat Jodo Yatra HAryana,Arjuna Awardee Deepak Niwas Hooda,Female Boxer Saweety Boora,Meets Rahul Gandhi in Haryana,Mango News,Mango news Telugu,Bharat Jodo Yatra,Priyanka Gandhi Participate In Rahul's Yatra, Bharat Jodo Yatra Madhya Pradesh, Rahul Gandhi Bharat Jodo Yatra, Rahul Gandhi Congress, Rahul Gandhi Padha Yatra, Congress Party , Indian National Congress, Inc Latest News And Updates, Sonia Gandhi, Priyanka Gandhi, Rahul Gandhi, Congress President Mallikarjun

కాంగ్రెస్ పార్టీలో తిరిగి జవసత్త్వాలు నింపడానికి ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో మూడవ రోజు శనివారం ఉదయం కర్నాల్ యొక్క ఘరోండా నుండి తిరిగి ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం, యాత్ర పానిపట్‌, మధుబన్ మీదుగా సాగి ఉచన వద్ద ఆగుతుంది. ఇక యాత్రలో భాగంగా పలువురు అథ్లెట్లు రాహుల్ గాంధీని కలిశారు. వీరిలో కబడ్డీ ప్లేయర్, అర్జున అవార్డు గ్రహీత దీపక్ నివాస్ హుడా మరియు మహిళా బాక్సర్ సావీటీ బూరా కర్నాల్‌లు ఉన్నారు. ఈ క్రమంలో వీరితో పాటు ఆయన రాష్ట్రంలోని పలువురు క్రీడాకారులతో సంభాషించారు. భారతదేశానికి హర్యానా రాష్ట్రం అగ్రశ్రేణి క్రీడాకారులను అందించిందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ నాయకుడు దీపేందర్ హుడా కూడా జోడో యాత్రలో భాగమయ్యారు.

కాగా, అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌తో సహా అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) విధానాలపై మరోసారి రాహుల్ గాంధీ మండిపడ్డారు. యాత్రలో భాగంగా పానిపట్‌లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకాన్ని తాను ప్రశ్నించినప్పుడల్లా బీజేపీ తనను ‘యాంటీ ఆర్మీ’ అని పిలుస్తుందని అన్నారు. నిరుద్యోగిత డేటాలో హర్యానా అగ్రస్థానంలో ఉందని, దీనికి బీజేపీ సర్కార్ ఏం సంధానం చెప్తుందని నిలదీశారు. ఇక మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ భారత్ జోడో యాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా చూపించడానికి లేదా ప్రకటించేందుకు దీనిని నిర్వహించడం లేదని స్పష్టం చేసిన ఆయన ఇది సైద్ధాంతిక యాత్ర అని పేర్కొన్నారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సాగే యాత్ర ఎన్నికల యాత్ర కానే కాదని జైరాం రమేష్ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − thirteen =