తక్షణమే ఆందోళన విరమించేది లేదు, వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటనపై రాకేష్ టికాయత్ స్పందన

3 Farm Laws, Agricultural Laws are Repealed in Parliament, Announced that Three New Farm Laws to be Repealed, BKU Leader Rakesh Tikait, BKU Leader Rakesh Tikait Says Protests will Continue Till Agricultural Laws are Repealed, BKU Leader Rakesh Tikait Says Protests will Continue Till Agricultural Laws are Repealed in Parliament, Centre to repeal 3 controversial farm laws, constitutional measures to repeal farm laws, Govt to repeal three contentious farm laws, Mango News, Parliament, PM Says 3 Farm Laws To Be Repealed, Three Farm Laws

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తునట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రధాని ప్రకటనపై రైతు ఉద్యమ నేత, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తక్షణమే తాము ఆందోళన విరమించేది లేదని, పార్లమెంట్‌లో వ్యవసాయ చట్టాలను రద్దు చేసే రోజు కోసం వేచి చూస్తామన్నారు. పంటలకు ఎంఎస్పీ (కనీస మద్దతు ధర) తో పాటుగా రైతుల ఇతర సమస్యలపై కూడా ప్రభుత్వం చర్చించాలని ఆయన పేర్కొన్నారు.

దాదాపు గత సంవత్సర కాలంగా మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమంలో రాకేష్ టికాయత్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉద్యమంలో భాగంగా పలుమార్లు భారత్ బంద్ నిర్వహణతో పాటుగా చలో ఢిల్లీ, ట్రాక్టర్ల ర్యాలీ, చక్కా జామ్ వంటి అనేక కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ప్రధాని ప్రకటన అనంతరం శుక్రవారం ఉదయం రాకేష్ టికాయత్ మాట్లాడుతూ, ప్రధాని ప్రకటన ఒక ఆరంభం మాత్రమేనని, పార్లమెంటులో చట్టాల రద్దు ఆమోదం, ఎంఎస్పీపై హామీ చట్టం చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =