ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపిన బీఎస్పీ అధినేత్రి మాయావతి

BSP Chief Mayawati Supports NDA Candidate Droupadi Murmu For Presidential Election, BSP Chief Mayawati Supports NDA Candidate Droupadi Murmu, Mayawati Supports NDA Candidate Droupadi Murmu For Presidential Election, Presidential Election, NDA Candidate Droupadi Murmu For Presidential Election, Bahujan Samaj Party Chief Mayawati Supports NDA Candidate Droupadi Murmu For Presidential Election, Bahujan Samaj Party Chief Mayawati, BSP Chief Mayawati, Bahujan Samaj Party, Mayawati, NDA Candidate Droupadi Murmu, Droupadi Murmu, NDA Candidate, Presidential Election News, Presidential Election Latest News, Presidential Election Latest Updates, Presidential Election Live Updates, Mango News, Mango News Telugu,

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఈ మేరకు ఆమె పార్టీ నిర్ణయాన్ని ప్రకటించారు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నామని, అయితే తాము బీజేపీకి గానీ, ఎన్డీయేకి గానీ మద్దతు ఇవ్వడం లేదని అన్నారు. అలాగని ప్రతిపక్షాలకు మేము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. బీఎస్పీ పార్టీ విధానాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని మాయావతి పేర్కొన్నారు. ముర్ముకి ఇప్పటికే ఎన్డీయే పక్షాలు కాకుండా.. ఆమె సొంత రాష్ట్రం ఒడిశాలోని నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్‌, ఏపీకి చెందిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ, ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగి నేతృత్వంలోని జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ (జే) వంటి పార్టీ మద్దతు పలికాయి.

అయితే ఈ క్రమంలో విపక్షాల అభ్యర్ధికి మద్దతు అంశంపై ప్రతిపక్ష నేతలెవరూ తమను సంప్రదించలేదని మాయావతి తెలియజేశారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదటి సమావేశానికి కొన్ని ఎంపిక చేసిన పార్టీలను మాత్రమే పిలిచారు, అలాగే ఆ తర్వాత నిర్వహించిన రెండవ సమావేశానికి సారధ్యం వహించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ కూడా బీఎస్పీని చర్చలకు ఆహ్వానించలేదని గుర్తుచేశారు. ప్రతిపక్షాలు తమ పార్టీకి వ్యతిరేకంగా కులతత్వ ధోరణిని కొనసాగిస్తున్నందున, రాష్ట్రపతి ఎన్నికలపై బీఎస్పీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడానికి దోహదపడిందని మాయావతి స్పష్టం చేశారు. కాగా వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరుగునున్నాయి. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా పోటీచేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =