పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌ రమీజ్ రాజాపై వేటు, తదుపరి ఛైర్మన్‌గా నజామ్ సేథీ?

Ramiz Raja Removed as the Chairman of Pakistan Cricket Board Najam Sethi set to Replace,Najam Sethi next Pakistan Cricket Board chairman, Pakistan Cricket Board chairman, Pakistan Cricket Board Rameez Raja,Mango News,Mango News Telugu,Pakistan Cricket Team,Pakistan Cricket Board Members,Pakistan Cricket Board Net Worth,Pakistan Cricket Team Players,Pakistan Cricket Team 2022,Pakistan Cricket News,Pakistan Cricket Coach,Pakistan Cricket Match,Pakistan Cricket Board Chairman,Pakistan Cricket Board,Pakistan Cricket Board Twitter,Pakistan Cricket Board Latest News,Pakistan Cricket Board Central Contract,Pakistan Cricket Board Shop,Pakistan Cricket Board Shop Online,Pakistan Cricket Board Jobs,Pcb Pakistan Cricket Board,Current Chairman Of Pakistan Cricket Board

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్‌ గా డిసెంబర్ 21, బుధవారం నాడు రమీజ్ రాజా తొలగించబడ్డాడు. పీసీబీ పాకిస్థాన్‌ లోని ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైర్మన్ రమీజ్ రాజాపై వేటు వేస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పీసీబీ తదుపరి ఛైర్మన్‌గా నజామ్ సేథీ నియమితులు కానున్నారు. ఈ మేరకు పాకిస్తాన్ ప్రధాని షాహబాజ్ షరీఫ్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. నజామ్ సేథీ నేతృత్వంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది మరియు సనా మీర్‌ లతో సహా 14 మంది సభ్యులతో కొత్త పీసీబీ కమిటీకి పాకిస్తాన్ కేబినెట్ ఆమోదం తెలపనున్నట్టు సమాచారం.

సెప్టెంబరు 2021లో పీసీబీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రమీజ్ రాజా సుమారు 14 నెలల పాటు ఈ పదవిలో ఉన్నారు. పీసీబీలోని ఒక వర్గం రమీజ్ రాజా పనితీరుతో అసంతృప్తిగా ఉండడం, పాకిస్తాన్ స్వదేశంలో వరుసగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ రెండు టెస్ట్ సిరీస్‌ లు ఓడిపోవడంతో పాటుగా, ఇండియా, పాకిస్తాన్ మధ్య క్రికెట్, వచ్చే ఆసియా కప్ నిర్వహణ, వచ్చే వరల్డ్ కప్ లో ఇండియాలో ఆడడం వంటి అంశాలపై రమీజ్ రాజా పదే పదే వ్యాఖ్యలు చేయడం వంటి అంశాలే అతనిపై వేటు పడటానికి కారణాలు అయిఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 1 =