లాకర్ల గురించి లోకల్‌ సర్కిల్స్‌ సర్వే ఏం చెబుతోంది?

Burden Of Locker Rent Can Users Bear It, Burden Of Locker Rent, Locker Rent, Can Users Bear It, Local Circles Survey Say About Lockers,Lockers,Banks, Latest Locker Rent News, Bank Locker News, Latest Bank News, Reserve Bank Of India, RBI Updates, Mango News, Mango News Telugu
Burden of locker rent, Can users bear it?, Local Circles survey say about lockers,lockers,Banks

బ్యాంక్ లాకర్‌ అద్దెలను ఆర్బీఐ భారీగా పెంచుతుండటంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు బాధ్యతలు-హక్కులను వివరిస్తూ గతంలో రూపొందించిన లాకర్‌ ఒప్పందాలను మళ్లీ కొత్తగా చేసుకోవాల్సి రావడం, చివరకు కేవైసీ వివరాలను మళ్లీ సమర్పించాల్సి రావడంతో బ్యాంకర్లు, ఆర్బీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల ఏకంగా 56 శాతం మంది వరకూ వినియోగదారులు వివిధ బ్యాంకుల్లో ఉన్న తమ లాకర్లను మూసివేసే ఆలోచనలో ఉన్నట్లు లోకల్‌ సర్కిల్స్‌ సర్వేలో తేలింది.

తాజాగా మరోసారి బ్యాంకు లాకర్‌ రెన్యువల్‌ చేసుకోవడానికి డిసెంబర్  31 గడువు తేదీగా నిర్ణయించడంతో.. దీని గురించి వినియోగదారులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి..లోకల్‌ సర్కిల్స్‌ ఓ సర్వే నిర్వహించింది. 218 జిల్లాల్లోని దాదాపు 23,000 మంది వినియోగదారుల నుంచి అభిప్రాయాలు సేకరించి ఓ నివేదికను రూపొందించింది.

మూడింట ఒక వంతు మందికి పైగా అకౌంట్ హోల్డర్లకు బ్యాంకు లాకర్లను సరెండర్‌ చేశారు. కానీ ఈ మూడేళ్ల బ్యాంకర్ల నిబంధనలను ఎక్కువ అవడంతో 36 శాతం మంది తమ లాకర్లను మూసివేశారు. కానీ ఇప్పుడు మిగిలిన 16 శాతం మందిపై మరింత భారం పడుతోంది. వీరే తమ లాకర్‌ సర్వీసుల కోసం ఎక్కువ మొత్తంలో ఛార్జీలను చెల్లించడంతో పాటు కేవైసీ నిబంధనలు పాటిస్తున్నారు.దీంతో వీళ్లు కూడా లాకర్లను క్లోజ్ చేయడానికి, లేదా చిన్న లాకర్లలోకి మారడానికి ఆలోచిస్తున్నట్లు  సర్వే తెలిపింది.

ఆర్‌బీఐ బ్యాంకులకు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. సవరించిన లాకర్‌ ఒప్పందాలపై సంతకాలు చేసి ఖాతాదారులు తమ బ్రాంచుకు చెందిన బ్యాంకులలో డిసెంబరు 31లోగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ కొత్త అగ్రిమెంటులో లాకర్లలో ఉంచే వస్తువులు, దస్త్రాలు వంటి  వాటి విషయంలో బ్యాంకుల బాధ్యత, భద్రపరచడాన్ని పునర్నిర్వచించారు. ప్రత్యేక హక్కులను, విధులతో పాటు లాకర్‌ అద్దె వివరాలను కూడా నిర్దేశించారు.

బ్యాంకులను అద్దెకు ఇచ్చే కంపెనీలుగా, వినియోగదార్లను అద్దెదార్లుగా  ఆర్బీఐ వ్యవహరిస్తుంది. అందుకే బ్యాంకుల నిర్లక్ష్యం వల్ల లాకర్లలో వస్తువులను, విలువైన పత్రాలను పోగొడితే.. వార్షిక అద్దెపై 100 రెట్ల వరకు పరిహారాన్ని అకౌంట్ హోల్డర్లకు ఆ బ్యాంకులు చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే అద్దెను బట్టి మాత్రమే పరిహారం ఉంటుంది తప్ప లాకర్లలో ఉంచిన వస్తువులు, పత్రాల విలువను పరిగణనలోకి తీసుకోరు. లాకర్లలో ఇకపై ఆభరణాలు, ముఖ్యమైన డాక్యుమెంట్స్  మాత్రమే ఉంచేలా కొత్త నిబంధనలు విధించారు. అంతేకాదు లాకర్లలో నిషేధించిన, ప్రమాదకర వస్తువులు ఉంచడానికి అనుమతి లేదు.

లోకల్‌ సర్కిల్స్‌ నిర్వహించిన సర్వే ప్రకారం.. కొంత మంది లాకర్ల వినియోగదారులు.. ఆర్బీఐ నిర్ధేశించిన  గడువులోగా కొత్త ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశాలు కనిపించడం లేదని  తెలుస్తోంది. ఎందుకంటే లాకర్లలో ఉంచిన 16 శాతం మందిలో ఎక్కువ మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. వీరిని ఆన్‌లైన్‌లో సంతకాలు చేయడానికి అవకాశం ఇవ్వాలని వీళ్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు లాకర్ల భద్రతపై భరోసా, బాధ్యతల నిర్వచనంలో క్లారిటీ ఇచ్చినా కూడా.. లాకర్లకు వార్షిక అద్దెలను గణనీయ స్థాయిలో పెంచడం వల్ల  త్వరలోనే తాము లాకర్లను క్లోజ్ చేస్తామని దాదాపు 56 శాతం మంది పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇలా ఇష్టారీతిలో లాకర్ల అద్దెలు పెంచకుండా  చూడాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని.. వారు అభిప్రాయపడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − eight =