స్వేద పత్రం విడుదల చేసిన కేటీఆర్

KTR Released The Sweda Document, Sweda Document, KTR Released Swedha Patram, Shwetha Patram, Swedha Patram KTR, Telangana Politics, BRS Shwetha Patram, BRS Latest Shwetha Patram News, BRS, KCR, Harish Rao, Latest Political News, Telangana, Mango News, Mango News Telugu
shwetha patram, swedha patram ktr, Telangana politics

తెలంగాణలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య చిన్నపాటి యుద్ధమే కొనసాగుతోంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ బకాయిలపై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం అప్పు రూ. 6,71,757 కోట్లుగా ఉన్నట్లు శ్వేత పత్రంలో ప్రభుత్వం పేర్కొంది.

అయితే ముందు నుంచి కూడా ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం తప్పుల తడకగా ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అన్ని తప్పుడు అంశాలు.. తప్పుడు లెక్కలను శ్వేత పత్రంలో పొందు పరిచారని అంటున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్ శ్వేత పత్రానికి దీటుగా బీఆర్ఎస్ స్వేద పత్రాన్ని విడుదల చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్‌లో ఆదివారం స్వేద పత్రాన్ని విడుదల చేశారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం తప్పుల తడకగా ఉందన్న కేటీఆర్.. ప్రస్తుతం రాష్ట్ర అప్పు కేవలం 3.17 లక్షల కోట్లు మాత్రమేనని వివరించారు. తమపై బురదజల్లేందుకు.. బద్నాం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న అప్పును డబుల్ చేసి చూపిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ నేతలు తెలంగాణను విధ్వంసం చేశారన్న కేటీఆర్.. ఇప్పుడు తెలంగాణను విఫల రాష్ట్రంగా  చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

అప్పులు, అభివృద్ధిని పోల్చి చూడాలని కేటీఆర్ కాంగ్రెస్ నేతలకు సూచించారు. 2014-15 నాటికి తెలంగాణ అప్పు రూ. 72,658 కోట్లు ఉందని.. ప్రస్తుతం రూ. 3.17 లక్షలుగా ఉందని వివరించారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పేదరికం తగ్గి.. తలసరి ఆదాయం పెరిగిందని వివరించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన సమయంలో తలసరి ఆదాయం 1.14 లక్షలగా ఉండగా.. ఇప్పుడు 3.17 లక్షలకు చేరిందని వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − one =