కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్లు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం

Central Government Announces Cancellation of MP Quota Seats in All Kendriya Vidyalayas, MP Quota Seats in All Kendriya Vidyalayas, Cancellation of MP Quota Seats in All Kendriya Vidyalayas, Central Government Announces Cancellation of MP Quota Seats, Central Government shock for MPS, Center has taken a key decision regarding MP quota seats in Kendriya Vidyalayas, MP quota seats in Kendriya Vidyalayas, Kendriya Vidyalayas, MP quota seats, Central Government Gives shock For Member of Parliament Quota Seats in All Kendriya Vidyalayas, Kendriya Vidyalayas MP Quota Seats, Kendriya Vidyalayas News, Kendriya Vidyalayas Latest News, Kendriya Vidyalayas Latest Updates, Mango News, Mango News Telugu,

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల కోసం ఎంపీ విచక్షణ కోటాను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ దేశంలోని అన్ని విద్యాలయాలకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా కింద అడ్మిషన్లు అంగీకరించబడవు. మాములుగా ఇప్పటివరకు పార్లమెంటు సభ్యుల (ఎంపీలు) కోటా కింద ప్రతి నియోజకవర్గం నుండి సంవత్సరానికి గరిష్టంగా 10 సీట్ల వరకు అడ్మిషన్లకు కేంద్రీయ విద్యాలయాల్లో అనుమతించబడేది. అయితే తాజా నిర్ణయంతో దీనికి చెక్ పడింది. అలాగే ఎంపీ కోటాతో పాటు ఇతర కోటాల కింద భర్తీ చేసే సీట్ల ప్రక్రియను కూడా పూర్తిగా రద్దు చేసింది.

గత కొన్ని నెలలుగా ఎంపీ కోటా సీట్ల సంఖ్య పెంచమంటూ కేంద్ర ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు వస్తున్నాయి. దీనిపై లోక్‌సభలో కూడా పెద్ద చర్చ జరిగింది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎదో ఒక నిర్ణయం తీసుకోవచ్చని అందరూ భావిస్తున్న తరుణంలో ఏకంగా ఇలా అన్ని కోటాల సీట్ల భర్తీ ప్రక్రియ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం భారతదేశంలోని 25 ప్రాంతాలలో 1,248 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ అయిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ దీనిని నిర్వహిస్తోంది. ఈ కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ తరగతులకు చెందిన మొత్తం 14,35,562 మంది విద్యార్థులు తమ చదువును కొనసాగిస్తున్నారు. కాగా దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − one =