ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

Central Govt Imposes 40% Duty on Onion Exports Amid Rise in Domestic Prices,Central Govt Imposes 40% Duty,40% Duty on Onion Exports,Amid Rise in Domestic Prices,Govt Imposes 40% Duty on Onion,Mango News,Mango News Telugu,Maharashtra, onion market, the onion crop has been damaged, a kg of onion is 50 rupees, price may increase further in the future, control onion prices,Central Govt Onion Exports,Onion Exports Latest News,Onion Exports Latest Updates,Onion Exports Live News,Central Govt Latest News

దేశీయ మార్కెట్‌లో నిన్నమొన్నటి వరకు టమాటా రేట్లు చుక్కలు చూపించాయి. కేజీ టమోటా 250 రూపాయల వరకు పలికిన రోజులు ఉన్నాయి. టామాటాను సాగు చేసిన కొందరు రైతులు కోటీశ్వరులు అయ్యారు. అతి తక్కువ కాలంలో కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించారు. ఇప్పుడు టమాటా రేట్లు ఫర్వాలేదనిపించే స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కేజీ టమాటా 45 రూపాయల వరకు పలుకుతోంది. మున్ముందు ఈ ధర మరింత తగ్గే అవకాశాలు లేకపోలేదు. టమోటా పంట దిగుబడి భారీఎత్తున ఉండటం, చాలినంత స్టాక్ మార్కెట్‌కు చేరుకోవటం వల్ల వాటి రేట్లు తగ్గాయి.

అదే సమయంలో ఉల్లి రేట్లు ఆకాశానికి ఎగబాకడం మొదలు పెట్టాయి. అతిపెద్ద ఉల్లి మార్కెట్‌గా పేరున్న మహారాష్ట్రలో.. భారీ వర్షాల వల్ల ఉల్లిపంట దెబ్బతింది. ఫలితంగా బహిరంగ మార్కెట్‌లో చాలినంత ఉల్లి అందుబాటులో ఉండట్లేదు. ఫలితంగా వాటి రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేజీ ఉల్లి 50 నుంచి 60 రూపాయల వరకు ఉంటోంది. మున్ముందు ఈ ధర మరింత పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉల్లి ధరలను నియంత్రించడానికి తక్షణ చర్యలను చేపట్టింది. ఉల్లి ఎగుమతులపై భారీగా వడ్డన విధించింది. ఉల్లి ఎగుమతులపై వసూలు చేస్తోన్న పన్ను మొత్తాన్ని భారీగా పెంచింది. ఉల్లి ఎగుమతిదారులు చెల్లించే పన్నుపై 40 శాతం మేర అదనపు భారాన్ని మోపింది. ఈ పెంపుదల తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది.

ఈ ఏడాది చివరి వరకూ అంటే డిసెంబర్ 31వ తేదీ వరకు ఉల్లి ఎగుమతులపై 40 శాతం అదనపు పన్ను భారం కొనసాగుతుంది. ఆ తరువాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా దీన్ని మరింత పొడిగించాలా..? లేక తొలగించాలా..? అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ చర్య వల్ల ఉల్లి ఎగుమతులు భారీగా తగ్గిపోతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఫలితంగా ఎగుమతి అయ్యే ఉల్లి మొత్తం దేశీయ మార్కెట్‌కు తరలుతుంది. దీంతో ఉల్లి కొరత ఏర్పడబోదని కేంద్రం యోచిస్తోంది. భారీ వర్షాలతో పాటు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోవడం.. ఉల్లి ధరలను ప్రభావితం చేసిందని, దీన్ని నియంత్రించడానికి తక్షణ చర్యలను తీసుకున్నామని తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =