ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ మరియు ఎంపీ నవనీత్ రాణాలకు వీఐపీ భద్రత కల్పించిన కేంద్ర ప్రభుత్వం

Central Govt Provides VIP Security To ISRO Chairman S Somanath and MP Navneet Rana, MP Navneet Rana were accorded armed VIP security cover by the Central Industrial Security Force, Indian Space Research Organisation Chairman S Somanath were accorded armed VIP security cover by the Central Industrial Security Force, Indian Space Research Organisation Chairman S Somanath, VIP security cover by the Central Industrial Security Force, Central Industrial Security Force, CISF VIP security, Central Govt Provides CISF VIP Security To ISRO Chairman S Somanath, Central Govt Provides CISF VIP security To MP Navneet Rana, ISRO Chairman S Somanath, MP Navneet Rana, Central Govt, Indian Space Research Organisation, CISF VIP security News, CISF VIP security Latest News, CISF VIP security Latest Updates, CISF VIP security Live Updates, Mango News, Mango News Telugu,

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చైర్మన్ ఎస్. సోమనాథ్‌ మరియు మహారాష్ట్ర ఎంపీ నవనీత్ రాణాలకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర సాయుధ వీఐపీ భద్రతను కల్పించినట్లు భద్రతాధికారులు శుక్రవారం తెలిపారు. ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్‌నాథ్‌కు ‘వై+’ కేటగిరీ భద్రత కల్పించారు. రాకెట్ శాస్త్రవేత్తలు దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా, వారి వెంట నాలుగు నుంచి ఆరుగురు సాయుధ కమెండోలు 24 గంటలూ ఉంటారని అధికారులు తెలిపారు. వారి భద్రత బాధ్యతను సీఐఎస్‌ఎఫ్‌కు అప్పగించారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) మరియు జియోస్టేషనరీ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సోమనాథ్‌ను ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఇస్రో చీఫ్‌గా నియమించింది. ఇంతకు ముందు ఆయన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్‌గా ఉన్నారు.

మహారాష్ట్రలోని అమరావతి స్థానానికి చెందిన లోక్‌సభ సభ్యురాలు నవనీత్ రాణాకు ‘వై’ కేటగిరీ భద్రత కల్పించామని, దీని కింద సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)కి చెందిన మూడు నుండి నలుగురు సాయుధ కమాండోలు ఆమెకు రక్షణ కల్పిస్తారని భద్రతాధికారులు తెలిపారు. ఏప్రిల్ 23న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నివాసం వెలుపల ‘హనుమాన్ చాలీసా’ పారాయణం చేస్తున్నందున శాంతిభద్రతలకు భంగం కలిగించవద్దని కోరుతూ ముంబై పోలీసులు శుక్రవారం ఎంపీ నవనీత్ రాణాకు మరియు ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాకు నోటీసులు జారీ చేశారు. ఈ జంట అనధికారికంగా భారతీయ జనతా పార్టీకి మద్దతుదారులుగా భావిస్తున్నారు. వీరిరువురి భద్రతాపరమైన ముప్పు ఉన్న దృష్ట్యా పారామిలటరీ కమాండోల సాయుధ భద్రతను అందించే కేంద్ర గూఢచార సంస్థల ప్రత్యేక సిఫార్సులను ఆమోదించిన తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =