ఉదయం 11 గంటలకు దేశవ్యాప్తంగా 2 నిమిషాలు మౌనం పాటించాలి

2021 Martyrs Day, Centre Asks States to Observe 2-min Silence, Centre asks states to strictly adhere to 2-minute silence, Mahatma Gandhi Death Anniversary, Mango News Telugu, Martyrs Day, Martyrs Day 2021, Observe 2 minute silence on January 30, Observe 2 Minutes Silence On Martyrs Day, Strict adherence of 2-minute silence on Martyrs Day, Two-minute Silence

ఈ రోజు (జనవరి 30, శనివారం) అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఉదయం 11 గంటలకు దేశవ్యాప్తంగా ప్రజలంతా రెండు నిమిషాల పాటుగా మౌనం పాటించాలని కేంద్రప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను ఆదేశిస్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. ఉదయం 10:59 నుంచి 11:00 గంటలవరకు తోలి సైరన్ వస్తుందని తెలిపారు. ఉదయం 11:00 గంటల నుంచి 11:02 వరకు మౌనం పాటించాలని సూచించారు. అలాగే 11:02 నుంచి 11:03 వరకు ముగింపు సైరన్ ఉంటుందని పేర్కొన్నారు.

సైరన్‌ అందుబాటులో లేని ప్రాంతాల్లో ఉదయం 11 గంటల నుంచి 2 నిమిషాల పాటుగా ప్రజలు ఎవరికీ వారే స్వచ్ఛందంగా మౌనం పాటించాలని సూచించారు. మౌనం పాటించే సమయంలో ఎక్కడివారు అక్కడే ఉండి పనులు, కదలికలు ఆపేయాలని కేంద్రం సూచించింది. అమరవీరులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఈ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని, అయితే మౌనం పాటించడం కొన్ని ఆఫీసులకే పరిమితమవుతూ వస్తోందని, ఈసారి దేశంలో ప్రజలందరూ పాల్గొనేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =