ఖండాలు 7 కాదట 8 అట.. 375 ఏళ్ల తర్వాత మరో ఖండాన్ని కనుగొన్న సైంటిస్టులు..

The Continents Are Not 7 But 8 Scientists Discovered Another Continent After 375 Years,The Continents Are Not 7 But 8,Scientists Discovered Another Continent,Another Continent After 375 Years,Mango News,Mango News Telugu,Zealandia, The Continents Are 8, Scientists Discovered Another Continent, After 375 Years,Zealandia Latest News,Zealandia Latest Updates,The Missing Continent Latest News,The Missing Continent Latest Updates,Scientists Latest News,Scientists Latest Updates

భూమిపై ఖండాలెన్ని ఉన్నాయిని ఎవరైనా అయినా అడిగితే వెంటనే ఏడు అని చెబుతాం. వాటి పేర్లేవి అంటే ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా అని చెప్పేస్తాం.కానీ ఇక నుంచి ఖండాల లెక్కలు మారాయి. అవును
తాజాగా 8వ ఖండం కూడా ఉందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.

375 ఏళ్లుగా తప్పిపోయిన ఓ ఖండాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ఖండం సుమారుగా 94 శాతం నీటి అడుగు భాగాన ఉండిపోయినట్లు గుర్తించారు. అంతేకాదు జియోలజిస్టులు, సెస్మాలజిస్టులతో కూడిన ఓ పరిశోధన బృందం.. ‘జిలాండియా లేదా లె రియు-ఎ-మౌయి’ అని పిలువబడే ఖండం మ్యాపును ఇప్పుడు రూపొందించారు. సముద్రం అడుగు భాగంలోని రాళ్ల నమూనాల డేటాను విశ్లేషించిన పరిశోధకులు..ఈ ఖండాన్ని కనుగొన్నారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ..రీసెంట్‌గా టెక్టోనిక్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

టెక్టోనిక్స్ జర్నల్‌లో ప్రచురితమయిన వివరాల ప్రకారం జిలాండియా 4.9 మిలియన్ చదరపు కి.మీటర్ల విస్తీర్ణంలో ఉన్న విశాలమైన భూభాగంగా తెలుస్తోంది. ఇది మడగాస్కర్‌తో పోలిస్తే ఆరు రెట్లు పెద్దదట. కొత్తగా కనుగొన్న ఈ ఖండం ప్రపంచంలోనే చిన్న, కొత్తదైన ఖండంగా పేరు సంపాదించుకుంది. ఈ కాంటినెంట్ 94 శాతం నీటిలో ఉందట.దీనిలో న్యూజిలాండ్ మాదిరిగానే ద్వీపాలు ఉన్నాయి.

శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం.. జిలాండియాను స్టడీ చేయడం చాలా కష్టమట. ప్రస్తుతం శాస్త్రవేత్తలు సముద్రం అడుగుభాగంలోని రాళ్లు, అవక్షేప నమూనాల గురించి స్టడీ చేస్తున్నారు. వీటిలో చాలా వరకు డ్రిల్లింగ్ నుంచి కొన్ని ద్వీపాల తీర ప్రాంతాల నుంచి సేకరించారు. ఈ రాతి నమూనాలు పశ్చిమ అంటార్కిటికా, న్యూజిలాండ్ పశ్చిమ తీరంలోని.. క్యాంప్ బెల్ పీఠభూమి దగ్గరలోని సబ్ డక్షన్ జోన్ పోలికను కలిగి ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు కొత్తగా రూపొందించిన ఈ జిలాండియా మ్యాప్.. దాని లొకేషన్‌ని మాత్రమే కాకుండా, భౌగోళిక లక్షణాలను కూడా చూపిస్తోందట.నిజానికి జిలాండియా కొన్ని మిలియన్ ఏళ్ల క్రితం ఉన్న సూపర్ కాంటినెంట్ అయిన గోండ్వానాలో ఒక భాగమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది దాదాపుగా 550 మిలియన్ ఏళ్ల క్రితం ఏర్పడిందని.. ఇది దక్షిణార్థ గోళంలో మొత్తం భూమిని కలిపి ఉందని అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 14 =