వరుసగా 16 వ రోజు పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Diesel Prices Hiked, Fuel Price Today, OMC hike petrol diesel prices, Petrol and diesel prices hiked, Petrol Diesel Prices Hiked, Petrol Price Hiked, Petrol price hiked by 55 paise, Petrol Price Hiked By Rs 6.02 A Litre In 11 Days, Petrol Price in Hyderabad

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా 16 వ రోజు కూడా పెరిగాయి. ఏప్రిల్ 2002 లో ధరలపై నియంత్రణ ఎత్తివేసిన అనంతరం ఆయిల్ కంపెనీలు వరుసగా 16 రోజుల పాటు ధరలు పెంచడం ఇదే మొదటిసారి. ధరల పెరుగుదలతో వినియోగదారులపై భారం ఎక్కువవుతుంది. ఇవాళ కొత్తగా పెట్రోల్‌పై లీటరుకు 33 పైసలు, డీజిల్‌పై లీటరుకు 58 పైసలు ధర పెరిగింది. కాగా ఈ 16 రోజుల్లోనే మొత్తంగా పెట్రోల్‌ పై రూ.8.30, డీజిల్‌ రూ.9.46 మేరకు ధరలు పెరిగాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు అటుఇటుగా సమానమవుతున్నాయి. పెరిగిన ధరలకు తోడు పలు రాష్ట్రాల్లో స్థానిక పన్నులు కూడా అదనంగా కలవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ సంవత్సరంలోనే గరిష్ఠానికి చేరుకున్నాయి.

ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు (లీటరుకు):

  • న్యూఢిల్లీ : పెట్రోలు ధర రూ.79.56, డీజిల్ రూ.78.85
  • కలకత్తా : పెట్రోలు ధర రూ.80.95, డీజిల్ రూ.74.14
  • ముంబై : పెట్రోలు ధర రూ.86.04, డీజిల్ రూ.77.24
  • చెన్నై : పెట్రోలు ధర రూ.82.87, డీజిల్ రూ.76.30
  • హైదరాబాద్: పెట్రోలు ధర రూ.82.59, డీజిల్ రూ.77.06
  • బెంగళూరు: పెట్రోలు ధర రూ.81.81, డీజిల్ రూ.74.98

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 16 =