మే 15 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్, సీఎం కీలక నిర్ణయం

Bihar CM Nitish Kumar Announced Lockdown in the State till May 15th,Mango News,Mango News Telugu,Bihar Complete Lockdown News,Bihar Lockdown,Lockdown In Bihar Till May 15,Lockdown In Bihar,Coronavirus,Bihar Imposes Lockdown Till May 15,Lockdown Imposed In Bihar Till May 15,Lockdown Imposed In Bihar,Bihar Govt Imposes Lockdown Till May 15,Bihar Lockdown News,Covid-19,Bihar Govt Announces Lockdown Till May 15,Bihar Covid-19,Bihar Coronavirus Updates,Bihar Coronavirus News,Bihar Coronavirus Latest Update,Covid-19 In Bihar,Lockdown In Bihar State,Lockdown In Bihar Till May 15 As Covid-19 Cases Surge,Coronavirus In India,Bihar CM Nitish Kumar,CM Nitish Kumar,CM Nitish Kumar Latest News,CM Nitish Kumar Live,Complete Lockdown In Bihar Till May 15,Bihar Lockdown Latest News

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మే 15 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు బీహార్ సీఎం నితీష్ కుమార్ మంగళవారం నాడు ప్రకటించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మంత్రులు, ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం తెలిపారు.

లాక్‌డౌన్ సమయంలో అవసరమైన సేవలు, బ్యాంకులు, నిర్మాణ, వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సేవలు, ప్రసారం మరియు కేబుల్ సేవలు,పెట్రోల్ పంపులు, ఎల్‌పిజి పెట్రోలియం మరియు గ్యాస్ రిటైల్ అవుట్‌లెట్‌లు, కోల్డ్ స్టోరేజ్ మరియు గిడ్డంగి సేవలుకు అనుమతి ఉంటుందన్నారు. నిత్యావసరాల దుకాణాలు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని సూచించారు. మరోవైపు బీహార్ లో ఇప్పటివరకు మొత్తం 5,09,047 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 3,98,558 మంది కరోనా నుంచి కోలుకోగా, 2,821 మంది మరణించారు. ప్రస్తుతం 1,07,667 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =