ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం, లాక్‌డౌన్‌ మరో వారం రోజులు పొడిగింపు

CM Arvind Kejriwal Announced that Lockdown in Delhi Extended By A Week,Mango News,Mango News Telugu,Delhi Lockdown Extended By One Week,Coronavirus,Kejriwal Extends Delhi Lockdown Till May 10,Lockdown In Delhi Extended By One More Week,Lockdown In Delhi To Be Extended By A Week,Lockdown In Delhi Extended By A Week,Delhi Extends Ongoing Lockdown By One Week,Covid-19 Crisis,Delhi Lockdown Extended By A Week,CM Arvind Kejriwal,Arvind Kejriwal,Lockdown in Delhi,Delhi Lockdown,Lockdown,Delhi,Delhi News,Delhi Covid-19 Updates,Lockdown in Delhi Extended,Covid-19 Lockdown In Delhi

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్‌ ను మరో వారంరోజుల పాటుగా పొడిగిస్తున్నట్టు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం నాడు ప్రకటించారు. అయితే ఢిల్లీలో లాక్‌డౌన్‌ ను పొడిగించడం ఇది రెండోసారి. ముందుగా ఏప్రిల్‌ 19 రాత్రి నుంచి ఏప్రిల్‌ 26 వరకు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ విధించారు. అనంతరం ఏప్రిల్ 26 నుంచి మే 3 వరకు పొడిగించారు. ప్రస్తుతం మే 10 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.

మరోవైపు ఢిల్లీకి 4.5 లక్షల డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్లు వచ్చాయని, అయితే సోమవారం నుంచి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికి వ్యాక్సిన్ వేయడం ప్రారంభిస్తామని తెలిపారు. వ్యాక్సిన్ కేంద్రాల్లో వాక్-ఇన్‌లు అనుమతించబడవని, ముందస్తు అప్పోయింట్మెంట్ తీసుకున్న వారికి మాత్రమే వ్యాక్సిన్ పంపిణీ ఉంటుందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here