మరికొద్దిసేపట్లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జో బైడెన్

2021 US Inauguration Day, Joe Biden, Joe Biden inauguration LIVE, Joe Biden inauguration Live Updates, Joe Biden Take Oath as US President, Joe Biden to take oath as 46th US President, Joe Biden To Take Oath as US President, Kamala Harris, Mango News, US Inauguration Day, US Inauguration Day 2021, US Presidential Inauguration, US Presidential Inauguration News

గత నవంబర్ 20న జరిగిన అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడిగా డెమొక్రాటిక్‌ నేత జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ల విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవలే అమెరికా కాంగ్రెస్‌ అధికారికంగా వీరి గెలుపును ధ్రువీకరించింది. జో బిడెన్ మొత్తం 306 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను గెలుచుకుని అధ్యక్షుడిగా విజయం సాధించినట్టు అమెరికా కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమెరికా 46వ అధ్యక్షుడిగా జనవరి 20, బుధవారం నాడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10.00 గంటలకు వాషింగ్టన్‌ డీసీలోని క్యాపిటల్‌ భవనంలో అమెరికా జాతీయగీతం ఆలాపనతో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభం కానుంది. 10:30 గంటలకు సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ జో బైడెన్ చేత అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

ఈ నేపథ్యంలో క్యాపిటల్‌ హిల్‌ భవనాన్ని సుందరంగా ముస్తాబు చేయడంతో పాటుగా, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ప్ర‌జ‌లెవ‌రూ హాజరు కావద్దని ఇప్ప‌టికే ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కరోనా పరిస్థితుల దృష్ట్యా 1000 మంది అతిథులనే అనుమతించనున్నారు. ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని అన్ని ప్రధాన టీవీ ఛానల్స్ లో లైవ్‌ టెలికాస్టింగ్ చేయనున్నారు. అలాగే అతిథుల కోసం విందు మెనూలో పలురకాల శాకాహార, మాంసాహార వంటకాలను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి హాజరుకానని ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 3 =