భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది, పెగాసస్‌తో నా ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తున్నారు – రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

Congress Leader Rahul Gandhi Alleged Indian Democracy Under Attack Pegasus Used To Spy on Me,Congress Leader Rahul Gandhi,Rahul Gandhi Alleged, Indian Democracy Under Attack, Pegasus Used To Spy on Me Rahul Gandhi,Mango News,Mango News Telugu,National Politics, Indian Politics, Indian Political News, National Political News, Latest Indian Political News,Congress Leader Rahul Gandhi Latest News,Congress Leader Rahul Gandhi Updates,Congress Leader Rahul Gandhi News and Updates

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, ప్రజాస్వామ్యానికి అవసరమైన సంస్థాగత ఫ్రేమ్‌వర్క్ నిర్బంధంగా మారిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కేంబ్రిడ్జ్ జడ్జి బిజినెస్ స్కూల్ (కేంబ్రిడ్జ్ జేబీఎస్)లో విజిటింగ్ ఫెలోగా ఉన్న రాహుల్ గాంధీ యూనివర్సిటీలోని విద్యార్థులకు ‘లెర్నింగ్ టు లిసన్ ఇన్ ది 21వ శతాబ్దం’ అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇండియాలో మీడియాను, న్యాయవ్యవస్థను నియంత్రిస్తున్నారని, నిఘా, బెదిరింపులు, మైనారిటీలు, దళితులు, గిరిజనులపై దాడులు, అసమ్మతిని బయటి ప్రపంచానికి తెలియనీయకుండా తొక్కిపెడుతున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

ఇంకా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తనపై గూఢచర్యం చేసేందుకు ప్రభుత్వం పెగాసస్‌ను ఉపయోగిస్తోందని ఆరోపించారు. తన ఫోన్‌లో పెగాసస్ స్పైవేర్ చొప్పించారని, అలాగే తనతో పాటు చాలామంది రాజకీయ నాయకుల ఫోన్‌లలో పెగాసస్ ఉందని అన్నారు. ఈ విషయాన్న్ని ఇంటెలిజెన్స్ అధికారులు కొందరు తనకు కాల్ చేసి చెప్పారని, తన ఫోన్ కాల్‌లు రికార్డ్ అవుతున్నందున ఫోన్‌లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇంటెలిజెన్స్ అధికారులు తనను హెచ్చరించారని తెలిపారు. దీంతో తనతో సహా చాలామంది నాయకులు నిరంతర ఒత్తిడికి లోనవుతున్నారని వెల్లడించారు. ఇక కొన్నిసార్లు పార్లమెంటు వద్ద ప్రతిపక్ష నాయకులు మాట్లాడటానికి కూడా పోలీసుల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రెజెంటేషన్ స్లైడ్‌లో తనను పోలీసు సిబ్బంది పట్టుకున్నట్లు కనిపిస్తున్న ఒక చిత్రాన్ని పంచుకున్న రాహుల్ దీనివెనుక ఏం జరిగిందో వివరించారు.

ఒకసారి పార్లమెంటు హౌస్ ముందు ప్రతిపక్ష నాయకులు కొన్ని సమస్యలపై మాట్లాడుతున్నారని, అయితే వీటిపై మాట్లాడనీయకుండా పోలీసులు అడ్డుకున్నారని, అంతటితో ఆగకుండా తమను జైల్లో పెట్టారని తెలిపారు. ఇలా ఒకసారి కాదని.. దాదాపు 3, 4 సార్లు జరిగిందని రాహుల్ గాంధీ తెలియజేశారు. కాగా ఇదిలా ఉండగా.. గత ఏడాది ఆగస్టులో, ప్రభుత్వం పెగాసస్‌ను స్నూపింగ్‌కు ఉపయోగిస్తుందన్న ఆరోపణలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు ఒక కమిటీని నియమించింది. ఈ సందర్భంగా తాము పరిశీలించిన 29 మొబైల్ ఫోన్‌లలో స్పైవేర్ కనిపించలేదని తేల్చిచెప్పడం గమనార్హం. కమిటీ నివేదికను చదివిన ధర్మాసనం, ‘టెక్నికల్ కమిటీ నివేదికపై ఆందోళన చెందుతున్నాం.. 29 ఫోన్లు ఇచ్చామని, ఐదు ఫోన్లలో కొన్ని మాల్వేర్‌లు కనిపించాయని, అయితే అది పెగాసస్ అని చెప్పలేమని టెక్నికల్ కమిటీ చెబుతోంది’ అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + eleven =