భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని భేటీ

Italy Prime Minister Giorgia Meloni Called On The President Droupadi Murmu At Rashtrapati Bhavan,Italy Prime Minister Giorgia Meloni,Prime Minister Giorgia Meloni At Rashtrapati Bhavan,Prime Minister Of Italy Calls On The President,Italy Prime Minister Called On The President Droupadi Murmu,Mango News,Mango News Telugu,Italian Pm Giorgia Meloni, President Murmu Invites Italian Companies,India President Droupadi Murmu,Presidential Candidate Draupadi Murmu,Presidency Of Droupadi Murmu,Giorgia Meloni,Italy Pm Giorgia Meloni Applauds

ఇటాలియన్ రిపబ్లిక్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని మార్చి 2, గురువారం భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారతదేశానికి తొలిసారిగా పర్యటనకు వచ్చిన జార్జియా మెలోనికి రాష్ట్రపతి స్వాగతం పలికారు. ఇటలీకి నాయకత్వం వహిస్తున్న యువతి, ఆత్మవిశ్వాసంతో ఉన్న మహిళను చూడటం సంతోషంగా ఉందన్నారు. మెలోని ఇటలీకి మొదటి మహిళా ప్రధాన మంత్రి మాత్రమే కాదని, తన దేశానికి అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానమంత్రి కూడా అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రపతి సచివాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

భారతదేశం మరియు ఇటలీ అద్భుతమైన స్నేహ సంబంధాలను కలిగి ఉన్నాయని రాష్ట్రపతి అన్నారు. ఆధునిక మరియు పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశాలుగా, భారతదేశం మరియు ఇటలీ చట్టం యొక్క నియమం, మానవ హక్కుల పట్ల గౌరవం మరియు సమ్మిళిత అభివృద్ధిపై ఆధారపడి ఆర్థిక వృద్ధిని సాధించడానికి కట్టుబడి ఉన్నాయన్నారు. ఈ పర్యటన భారత్-ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలను పునరుజ్జీవింపజేస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశ ప్రధాన ఆర్థిక భాగస్వాములలో ఇటలీ ఒకటని రాష్ట్రపతి అన్నారు. క్లీన్ ఎనర్జీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాలలో భారతదేశం మరియు ఇటలీ మధ్య భాగస్వామ్యం మంచి పురోగతిని సాధిస్తోందని పేర్కొన్నారు. భారత్‌ లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె ఇటాలియన్ కంపెనీలను ఆహ్వానించారు. భారతదేశం అధ్యక్షతన జీ-20 మరియు ఇటలీ రాబోయే జీ-7 అధ్యక్ష పదవిలో, హెల్త్ కేర్, క్లైమేట్ చేంజ్ మరియు డిజిటల్ టెక్నాలజీ వంటి పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో భారతదేశం మరియు ఇటలీ కలిసి పనిచేసే అవకాశం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.

ముందుగా గురువారం ఉదయం భారత్ చేరుకున్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి రాష్ట్రపతి భవన్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనస్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్ వద్ద జరిగిన సెర్మోనియల్ రిసెప్షన్ లో భద్రతా ధళాల నుంచి జార్జియా మెలోని గౌరవం వందనం స్వీకరించారు. అనంతరం ఢిల్లీలోని రాజ్ ఘాట్ ను సందర్శించి, జాతిపిత మహాత్మగాంధీ సమాధి వద్ద జార్జియా మెలోని నివాళులర్పించారు. ఆ తర్వాత హైదరాబాద్ హౌస్ వేదికగా ప్రధాని మోదీతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో ఇరు దేశాల సంబంధాలు సహా ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + sixteen =