రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా.. నలుపు వస్త్రాలు ధరించి పార్లమెంట్‌కు వచ్చిన కాంగ్రెస్ ఎంపీలు

Congress MPs Wear Black Clothes in Parliament Against Rahul Gandhis Disqualification,Congress MPs Wear Black Clothes in Parliament,Congress MPs Against Rahul Gandhis Disqualification,Rahul Gandhis Disqualification,Mango News,Mango News Telugu,Congress MPs wear black to protest against Rahul,Opposition MPs Meet At Parl Complex,Opposition MPs meet at Parliament complex,Opposition protest to save democracy,Congress MPs to protest in black clothes,Rahul Gandhis Disqualification Latest News,Congress MPs Latest News and Updates,Indian Political News

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు విధించినందుకు నిరసన కాంగ్రెస్ ఎంపీలు సోమవారం నలుపు రంగు దుస్తులు ధరించి వచ్చారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు, సోనియా గాంధీ బూడిద రంగు చీర ధరించి పైన నలుపు రంగు వస్త్రంతో రావడం విశేషం. ఈ క్రమంలో సోమవారం ఉదయం పార్లమెంట్‌లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో భావసారూప్యత కలిగిన ప్రతిపక్షాల సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీతో పాటు డీఎంకే, ఎస్పీ, జేడీయూ, బీఆర్ఎస్, సీపీఎం, ఆర్జేడీ, ఎన్సీపీ, సీపీఐ కేరళ కాంగ్రెస్, టీఎంసీ, ఆప్ తదితర పార్టీల సభ్యులు హాజరయ్యారు. ఖర్గే ఛాంబర్‌లో నిర్వహించిన ఈ వ్యూహాత్మక సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు కూడా పాల్గొనడం గమనార్హం. ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవలే రాహుల్ గాంధీని ఉద్దేశించి పలు విమర్శలు చేయడం తెలిసిందే.

ఇక ఇదిలాఉండగా సభలో మాట్లాడేందుకు రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు పెద్దఎత్తున నిరసన తెలిపారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ లోక్‌సభలో వాయిదా తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. అయితే స్పీకర్ దీనికి అనుమతి ఇవ్వక పోవడంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అంటూ కాంగ్రెస్ ఎంపీలు సభలో నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ లోక్‌సభను మధ్యాహ్నం 4 గంటలకు వాయిదా వేయగా.. రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఇక కీలక బిల్లుల ఆమోదం కోసం రాజ్యసభ ఎంపీలకు బీజేపీ సోమవారం విప్ జారీ చేసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అనర్హత వేటు విషయంలో మూకుమ్మడి రాజీనామాలు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో భాగంగా సోమవారం జరుగుతున్న పరిణామాలు సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 1 =