ఎల్లుండి తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన, రామగుండంలో ఎరువుల ప్లాంట్‌ జాతికి అంకితం

PM Modi Tour in Telangana on Novermber 12th PM Will Dedicate Fertilizer Plant at Ramagundam to the Nation,PM Modi Telangana Tour,Fertilizer Plant Opening in Ramagundam, Ramagundam Fertilizer Plant,Mango News,Mango News Telugu,PM Modi, PM Modi Telangana Tour,Telangana Tour By PM Modi,Novermber 12th Telangana Tour, Telangana Tour Novermber 12th, Ramagundam, Fertilizer Plant Dedicated To Nation,PM Modi Latest News And Updates

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి (నవంబర్ 12, శనివారం) తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రామగుండం నుంచి రాష్ట్రంలో రూ.9500 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయడంతో పాటుగా శంకుస్థాపనలు చేయనున్నారు. ముందుగా రామగుండంలో ఎరువుల ప్లాంట్‌ను/రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌)ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. రామగుండం ప్రాజెక్టుకు 2016, ఆగస్టు 7న ప్రధాని మోదీనే శంకుస్థాపన చేశారు. యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలనే ప్రధాని దార్శనికతలో భాగంగా ఈ ఫెర్టిలైజర్ ప్లాంట్ పునరుద్ధరణ చేయబడిందని తెలిపారు. రామగుండం ప్లాంట్ సంవత్సరానికి 12.7 ఎల్ఎంటీ దేశీయ వేప పూతతో కూడిన యూరియా ఉత్పత్తిని అందుబాటులోకి తెస్తుంది.

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్), ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) మరియు ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్సీఐఎల్) జాయింట్ వెంచర్ కంపెనీ అయిన రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయబడింది. రూ.6300 కోట్లుకంటే ఎక్కువ పెట్టుబడితో న్యూ అమ్మోనియా-యూరియా ప్లాంట్‌ను ఏర్పాటు చేసే బాధ్యతను ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు అప్పగించారు. ఆర్‌ఎఫ్‌సిఎల్ ప్లాంట్‌కు గ్యాస్ జగదీష్‌పూర్-ఫుల్పూర్-హల్దియా పైప్‌లైన్ ద్వారా సరఫరా చేయబడుతుంది.

తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ మరియు మహారాష్ట్రలోని రైతులకు యూరియా ఎరువులు తగినంత మరియు సకాలంలో సరఫరా అయ్యేలా ప్లాంట్ నిర్ధారించనుంది. ఈ ప్లాంట్ ఎరువుల లభ్యతను మెరుగుపరచడమే కాకుండా రోడ్లు, రైల్వేలు, అనుబంధ పరిశ్రమల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా ఈ ప్రాంతంలో మొత్తం ఆర్థికాభివృద్ధిని కూడా పెంచుతుందని తెలిపారు. ఫ్యాక్టరీకి వివిధ వస్తువుల సరఫరా కోసం ఎంఎస్ఎంఈ విక్రేతల అభివృద్ధి నుండి ఈ ప్రాంతం ప్రయోజనం పొందుతుందన్నారు. ఆర్‌ఎఫ్‌సిఎల్ యొక్క ‘భారత్ యూరియా’ దిగుమతులను తగ్గించడమే కాకుండా ఎరువులు సకాలంలో సరఫరా చేయడం ద్వారా స్థానిక రైతులకు ప్రోత్సాహాన్ని అందించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు అద్భుతమైన ప్రోత్సాహాన్ని అందిస్తుందని చెప్పారు.

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన కార్యక్రమాలు:

  • రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌)ను ప్రధాని జాతికి అంకితం
  • దాదాపు రూ.1000 కోట్ల వ్యయంతో నిర్మించిన భద్రాచలం రోడ్డు-సత్తుపల్లి రైలు మార్గాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు.
  • రూ.2200 కోట్లకు పైగా విలువైన వివిధ రహదారుల ప్రాజెక్టులకు (మెదక్‌-సిద్దిపేట-ఎల్కతుర్తి-NH- 765డీజీ, బోధన్‌-బాసర-భైంసా-NH-161 బీబీ, సిరొంచా-మహదేవ్‌పూర్‌-NH-353సీ) ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
  • అనంతరం బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + eleven =