పంజాబ్ కొత్త పీసీసీ చీఫ్‌గా అమరీందర్ సింగ్ రాజా వారింగ్.. ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Congress Named Amarinder Singh Raja Warring As New Punjab PCC Chief, Raja Warring replaces Navjot Singh Sidhu As New Punjab PCC Chief, Amarinder Singh Raja Warring As New Punjab PCC Chief, New Punjab PCC Chief, PPCC Chief, New PPCC Chief, Congress Named Amarinder Singh Raja Warring As New PPCC Chief, Amarinder Singh Raja Warring, Raja Warring was appointed the party's new Punjab chief, Raja Warring As New Punjab PCC Chief, Raja Warring, New Punjab PCC Chief Latest News, New Punjab PCC Chief Latest Updates, New Punjab PCC Chief Live Updates, Mango News, Mango News Telugu,

శనివారం అర్థరాత్రి పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిపిసిసి) అధ్యక్షుడిగా అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నియమించారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వేవ్‌తో పార్టీ తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో పార్టీ ప్రక్షాలను కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. ఈ క్రమంలో పార్టీకి విధేయులైన నాయకుల జాబితాను సిద్ధం చేసింది. అయితే, పార్టీని సమర్ధంగా నడిపించటానికి యువకులకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపించటంతో సమర్ధుడైన అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ను కొత్త పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్థానంలో రాజా వారింగ్ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.

44 సంవత్సరాల రాజా వారింగ్ విద్యార్థి నాయకుడిగా ఎదిగి రాజకీయాలలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం శిరోమణి అకాలీదళ్‌లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు రణదీప్ సుర్జేవాలా మరియు జగ్మీత్ బ్రార్ నుండి రాజకీయ పాఠాలు నేర్చుకున్నాడు. రాజా వారింగ్ 2014-2018 మధ్య యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అలాగే గత చరణ్‌జిత్ సింగ్ చన్నీ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వంలో రవాణా మంత్రిగా పనిచేశారు. ఆప్ హావలో రాష్ట్రంలో గెలిచినా 18 మంది నాయకులలో రాజా వారింగ్ ఒకరు. ఈయన వరుసగా మూడోసారి ఎన్నికల్లో గిద్దర్‌బాహా అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నారు. కాగా చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయిన వారింగ్, ఉత్తరప్రదేశ్‌లో 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీ తరపున చురుకుగా పనిచేశారు. తద్వారా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టిలో పడ్డారు. ప్రస్తుత పంజాబ్ రాజకీయాలలో పార్టీ వాణిని ప్రజలకు చేరవేయడంలో రాజా వారింగ్ కీలక పాత్ర పోషించగలడని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + nineteen =