ఇండియాలో ‘ఎక్స్ఈ’ వేరియంట్‌పై ఆందోళన అనవసరం – ఎన్‌టిఎజిఐ చీఫ్ ఎన్‌కె అరోరా

Covid-19 Nothing To Panic Says NTAGI Chief After India Confirms Cases of XE Variant, NTAGI Chief Says Nothing To Panic After India Confirms Cases of XE Variant, India Confirms Cases of XE Variant, XE Variant, NTAGI Chief, Corona Virus Variant XE, new Covid-19 cases, new Covid-19 cases In India, India Covid-19 Updates, India Covid-19 Live Updates, India Covid-19 Latest Updates, Coronavirus, coronavirus India, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant,, India Department of Health, India coronavirus, India coronavirus News, India coronavirus Live Updates, Mango News, Mango News Telugu,

కోవిడ్ యొక్క కొత్త ‘ఎక్స్ఈ’ వేరియంట్ కేసులను భారతదేశంలో వెలుగుచూసిన తర్వాత భయపడాల్సిన అవసరం లేదు అని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టిఎజిఐ) చీఫ్ చెప్పారు. X సిరీస్‌లోని ఒమిక్రాన్ వేరియంట్‌లు తీవ్రమైన వ్యాధులను కలిగించవని ఆయన తెలిపారు. మహారాష్ట్ర, గుజరాత్‌లలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కొత్త ఎక్స్ఈ వేరియంట్ కరోనా వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. అలాగే ఇది అంత ప్రాణాంతకం కాదని కూడా స్పష్టం చేశారు. ప్రపంచంలో ఇది వెలుగు చూసిన దేశాల్లో దీనివలన ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు.

ఎన్‌టిఎజిఐ చీఫ్ ఎన్‌కె అరోరా దీనిపై మాట్లాడుతూ.. ఎక్స్ సిరీస్‌లోని ఒమిక్రాన్ వేరియంట్‌లు తీవ్రమైన వ్యాధులను కలిగించవని, ప్రస్తుతం నమోదవుతున్న కేసుల ప్రకారం దేశంలో ఇది అంత వేగంగా వ్యాప్తి చెందడం లేదని పేర్కొన్నారు. ఒమిక్రాన్ అనేక కొత్త వేరియంట్‌లకు దారి తీస్తోంది. ఎక్స్ సిరీస్‌లో భాగమే ఈ ఎక్స్ఈ, ఇలాంటి మరెన్నో వేరియంట్‌లు ఏర్పడుతూనే ఉంటాయి. అయితే వీటికి భయపడాల్సిన పనిలేదని ఆయన తెలిపారు. ఇటీవల మహారాష్ట్రలోని ముంబైలో ఒమిక్రాన్ యొక్క సబ్-వేరియంట్ ఎక్స్ఈ కేసు కనుగొనబడింది. రెండు టీకాలు వేసిన 67 ఏళ్ల వ్యక్తిలో ఈ వేరియంట్ గుర్తించినట్లు బీఎంసీ ధృవీకరించింది. అనంతరం ఇలాంటిదే మరో కేసు గుజరాత్ లో బయటపడింది. దీంతో ఇండియాలో కరోనా మరో వేవ్ రావచ్చని అందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే డా. అరోరా ఎక్స్ఈ వేరియంట్‌పై సమాచారాన్ని పంచుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + two =