ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక ప్రకటన, వచ్చే జనవరి-ఫిబ్రవరిలో భారీస్థాయిలో “ఢిల్లీ షాపింగ్ ఫెస్టివల్”

Delhi CM Arvind Kejriwal Announces to Host Delhi Shopping Festival in January-February 2023, CM Arvind Kejriwal Announces to Host Delhi Shopping Festival in January-February 2023, Arvind Kejriwal Announces to Host Delhi Shopping Festival in January-February 2023, Delhi CM Announces to Host Delhi Shopping Festival in January-February 2023, Host Delhi Shopping Festival in January-February 2023, Delhi Shopping Festival in January-February 2023, Delhi Shopping Festival, January-February 2023, Delhi CM Arvind Kejriwal announces Delhi biggest shopping festival from January-February 2023, Delhi to host India’s biggest shopping festival from January-February 2023, India’s biggest shopping festival from January-February 2023, Chief Minister Arvind Kejriwal, Delhi CM Arvind Kejriwal, CM Arvind Kejriwal, Arvind Kejriwal, Delhi CM, India’s biggest shopping festival, Delhi Shopping Festival News, Delhi Shopping Festival Latest News, Delhi Shopping Festival Latest Updates, Delhi Shopping Festival Live Updates, Mango News, Mango News Telugu,

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం కీలక ప్రకటన చేశారు. జనవరి 28, 2023 నుంచి ఫిబ్రవరి 26, 2023 వరకు నెలరోజుల పాటుగా దేశ రాజధాని ఢిల్లీలో ‘ఢిల్లీ షాపింగ్ ఫెస్టివల్’ జరగనుందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దేశంలోనే ఇదే అతిపెద్ద షాపింగ్ ఫెస్టివల్‌ కానుందని పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, ఢిల్లీలో ఉపాధి, వ్యాపారం మరియు ఆర్థిక వ్యవస్థకు శుభవార్త అందిస్తున్నామని, 2023 ప్రారంభంలో ప్రపంచ స్థాయి “ఢిల్లీ షాపింగ్ ఫెస్టివల్”ని ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించనుందని తెలిపారు. ఢిల్లీ షాపింగ్ ఫెస్టివల్ ద్వారా ఆదాయం, ఉద్యోగాలు కూడా లభిస్తాయని చెప్పారు. ఢిల్లీ యొక్క సంస్కృతి, ఫుడ్ మరియు షాపింగ్‌ కోసం దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటుగా విదేశాల నుండి కూడా అతిథులు వస్తారని, ఈ కార్యక్రమంతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.

షాపింగ్ ఫెస్టివల్ సందర్భంగా ఢిల్లీ అంతా అలంకరించబడుతుందని, క్లాత్స్, ఫుడ్ ఐటమ్స్ నుంచి గృహోపకరణాల వరకు అన్ని ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. షాపింగ్ ఫెస్టివల్ కోసం ప్రత్యేకంగా ప్రారంభ మరియు ముగింపు వేడుకలు ఉంటాయని, అలాగే సందర్శకులను అలరించేలా 200 కచేరీలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు. మరోవైపు షాపింగ్ ఫెస్టివల్ సమయంలో ఢిల్లీ వెళ్లాలనుకునే వారికి ప్రత్యేక ప్యాకేజీలు అందించేలా హోటళ్లు, విమానయాన సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − fourteen =