ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. సొంత ప్రభుత్వంపై అసెంబ్లీలో విశ్వాస తీర్మానం

Delhi CM Arvind Kejriwal Tables Confidence Motion on His Own Govt in Assembly Today, CM Kejriwal Tables Confidence Motion In Delhi Assembly, Arvind Kejriwal Confidence Motion In Delhi Assembly, Delhi CM Arvind Kejriwal Majority Test, Mango News, Mango News Telugu, Delhi CM Arvind Kejriwal , Arvind Kejriwal Latest News And Updates, Delhi Confidence Motion Live Updates, Delhi Assembly Latest News, Delhi Government, AAP Party, BJP, Indian Govt, Aam Aadmi Party News

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఆయన సోమవారం తన సొంత ప్రభుత్వంపై అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తద్వారా ఆయన సారధ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఎమ్మెల్యేలు ఎవరూ దూరం కాలేదని ప్రకటించారు. కాగా ఆప్‌ సర్కార్‌ను కూల్చేందుకు తమ పార్టీకి చెందిన సుమారు 20 ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ రూ.. 800 కోట్లు సిద్ధం కూడా చేసిందని ఇటీవలే సీఎం కేజ్రీవాల్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. తమ ఎమ్మెల్యేలలో ఒక్కరు కూడా పార్టీ నుంచి బయటకు పోలేదని, ఒక్కరు కూడా అమ్ముడు పోలేదని నిరూపించడానికై నేడు అసెంబ్లీలో ‘విశ్వాస తీర్మానం’ ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా సభలో సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ ‘ఆపరేషన్ లోటస్‌’ విధానం ద్వారా అక్రమంగా మణిపూర్, బీహార్, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టిందని కేజ్రీవాల్ ఆరోపించారు. దీనికోసం కొన్ని చోట్ల రూ.50 కోట్లు కూడా చెల్లించారని ఆరోపించారు. మీరు ఒకవైపు అవినీతికి వ్యతిరేకమని అంటున్నారు, ఇంకోవైపు వారికి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాల్లోని ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే జార్ఖండ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కూడా సకల ప్రయత్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు. అయితే వారి ప్రయత్నం ఇక్కడ ఢిల్లీలో విఫలమైందని చూపించడానికే విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. అలాగే దీని ద్వారా ప్రతి ఆప్ ఎమ్మెల్యే నిజాయితీపరుడని ఢిల్లీ ప్రజలకు, ఇతర ప్రతిపక్ష పార్టీలకూ తేటతెల్లం అయిందని తెలిపారు. ఈ క్రమంలోనే జార్ఖండ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కూడా సకల ప్రయత్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 5 =