ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చంపేందుకు కుట్ర జరుగుతోంది – ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా సంచలన ఆరోపణలు

Delhi Deputy CM Manish Sisodia Sensational Alleges Over BJP Conspiring to Assasin CM Arvind Kejriwal,Conspiracy To Kill Delhi Cm Kejriwal, Deputy Chief Minister Manish Sisodia,Delhi Cm Kejriwal,Mango News,Mango News Telugu,Delhi Cm Aravind Kejriwal,Delhi Cm,Delhi Chief Minister Latest News and Updates,Delhi Chief Minister,Delhi Cm Kejriwal News,Delhi Deputy Chief Minister,Delhi Deputy Chief Minister Manish Sisodia,Manish Sisodia News and Live Updates,CM Arvind Kejriwal,BJP,AAP

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా. శుక్రవారం ఆయన ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ.. త్వరలో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే సీఎం కేజ్రీవాల్‌ను హతమార్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిలో ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ ప్రమేయం ఉందని సిసోడియా ఆరోపించారు. అయితే ఇలాంటి చిల్లర రాజకీయాలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) భయపడదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ తన అనుచరులను సీఎం కేజ్రీవాల్‌పై దాడి చేయమని బహిరంగంగానే పిలుపునిస్తున్నారని, దీనిపై బీజేపీ పెద్దలు స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కానీ వారి గూండాయిజానికి ప్రజలు తగిన సమాధానం ఇస్తారు.

కాగా ఈశాన్య ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ గురువారం ట్విట్టర్ వేదికగా.. ‘అరవింద్ కేజ్రీవాల్ భద్రత గురించి నేను ఆందోళన చెందుతున్నాను. ఎందుకంటే ప్రజలు మరియు ఆప్ వాలంటీర్లు నిరంతర అవినీతి, టిక్కెట్ల అమ్మకం, రేపిస్ట్‌తో వారి మంత్రి స్నేహం చేయడం మరియు జైలులో మసాజ్ చేయించుకోవడం వంటివాటిపై కోపంగా ఉన్నారు. వారి కార్యకర్తలకు వారి ఎమ్మెల్యేలపై విశ్వాసం పోయింది. అందుకే ఆప్ ఎమ్మెల్యేలపై ఆ ఆపార్టీ కార్యకర్తలే దాడి చేసి కొట్టారు. కానీ వారు దాడి చేయాల్సింది ఎమ్మెల్యేలపై కాదు, ఢిల్లీ ముఖ్యమంత్రి పైన చేయాలి’ అని హిందీలో ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here