కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతో పాటు మాలిక్‌కు రూ. 10 లక్షల జరిమానా కూడా విధించింది. కేసు విచారిస్తున్న రాజీవ్ కుమార్ శర్మ సెలవుల్లో ఉన్నందున స్పెషల్ జడ్జీ ప్రవీణ్ సింగ్ తన తీర్పును వెల్లడించారు. అయితే అంతకుముందు సెక్షన్ 121 కింద యాసిన్ మాలిక్‌కు ఉరిశిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ కోర్టులో వాదనలు వినిపించింది. ఈ సెక్షన్ కింద ఉరి మ్యాగ్జిమమ్ పనిష్మెంట్ కాగా, అతితక్కువ అంటే యావజ్జీవమే. 2017లో కాశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం మరియు వేర్పాటువాద కార్యకలాపాలకు సంబంధించిన ఆరోపణలపై నేరాన్ని అంగీకరించిన తర్వాత యాసిన్ మాలిక్‌ను ఢిల్లీ కోర్టు గత వారం దోషిగా నిర్ధారించింది.
ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో దోషిగా తేలిన నిషేధిత జమ్మూ మరియు కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) అధినేత యాసిన్ మాలిక్‌పై 2017లో కేసు నమోదయింది. అయితే మాలిక్‌కు సహాయం చేయడానికి కోర్టు నియమించిన అమికస్ క్యూరీ జీవిత ఖైదు విషయంలో కనీస శిక్షను కోరింది. భద్రతా బలగాలపైకి రాళ్లు రువ్వడం, స్కూల్స్ తగలపెట్టడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, దేశ విద్రోహ చర్యలకు పాల్పడడం వంటి వాటి కోసం ఉగ్రనిధులను వినియోగించినట్టు ఎన్ఐఏ అభియోగాలు మోపింది. కాగా తనకు మరణశిక్ష విధించాలని ఎన్ఐఏ కోరడంపై యాసిన్ మాలిక్ స్పందించారు. తను ఎవరినీ బ్రతిమాలనని, కేసు కోర్టులో ఉన్నందున దానికే నిర్ణయానికే వదిలేస్తున్నట్లు తెలిపారు. మాలిక్‌కు విధించిన శిక్షల పరిమాణంపై కోర్టు తీర్పు తర్వాత వెలువడే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ