దావోస్ వేదికగా పలు అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకొస్తున్నాయి. మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ అధికారుల బృందం అనేక ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా స్విస్ రైల్వే రోలింగ్ స్టాక్ తయారీదారు ‘స్టాడ్లర్ రైల్’ కంపెనీ తెలంగాణలో రూ. 1,000 కోట్ల పెట్టుబడికి సంసిద్ధత తెలిపింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. దీనికి అంగీకరిస్తూ ఇరు పక్షాలూ.. స్టాడ్లర్ రైల్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అన్స్ గార్డ్ బ్రోక్ మెయ్, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ద్వారా దాదాపు 2500 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Delighted to announce that ‘Stadler Rail’ will be setting up their Rail Coach Manufacturing unit in Telangana
This investment will be a joint venture b/w Medha Servo Drives & Stadler Rail with an investment of ₹ 1,000 Cr. which will create 2,500 jobs for our youngsters pic.twitter.com/Ntnxs1oU6x
— KTR (@KTRTRS) May 25, 2022
అయితే హైదరాబాద్‌కు చెందిన మరో ప్రముఖ కంపెనీ ‘మేధా’ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ‘స్టాడ్లర్ రైల్’ కంపెనీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. స్విస్ రైల్వే రోలింగ్ స్టాక్ తయారీదారు స్టాడ్లర్ రైల్‌తో కలిసి తెలంగాణలో రూ. 1,000 కోట్ల పెట్టుబడితో రైల్ కోచ్ తయారీ కోసం జాయింట్ వెంచర్‌లోకి ప్రవేశించనున్నామని ‘మేధా’ సర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు తెలిపారు. ఈ ఫ్యాక్టరీలో తయారుచేసే రైల్వే కోచ్‌లను భారత్‌తో పాటు ఏషియా పసిఫిక్ రీజియన్‌కు కూడా ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ