స్వాతంత్య్ర దినోత్సవం ముందు ఢిల్లీలో ఉగ్ర అలజడి.. 2,000 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

Delhi on High Alert After Police Recovers Huge Amount of 2000 Live Cartridges Ahead of Independence Day, Police Recovers Huge Amount of 2000 Live Cartridges Ahead of Independence Day, Delhi on High Alert, Police Recovers Huge Amount of 2000 Live Cartridges, 2000 Live Cartridges, 75th Independence Day, Independence Day, Independence Day Celebrations, Big terror attack plot In Delhi, Delhi News, Delhi Latest News, Delhi Latest Updates, Delhi Live Updates, 2200 ammunition, Mango News, Mango News Telugu,

దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 వసంతాలు అవుతున్న సందర్భంగా ఆ పర్వదినాన్ని వేడుకలా జరుపుకునేందుకు యావత్తు దేశం సిద్ధమవుతున్న సమయంలో ఢిల్లీలో ఉగ్ర అలజడి రేగింది. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అక్రమంగా రవాణా చేస్తున్న ఆరుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడంతో దేశానికి పెను ముప్పు తప్పింది. వీరి వద్ద భారీగా 2,000 లైవ్ కాట్రిడ్జ్‌లు కలిగి ఉండటం కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో నగరంలో హై అలెర్ట్ ప్రకటించిన పోలీసులు ముఖ్యమైన ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఒక వారంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండవసారి. దీనికి ముందు ‘ఐఎస్ఐఎస్’ అనే అతి తీవ్రవాద సంస్థ సభ్యుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

కాగా అతడిని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి అహ్మద్ గా గుర్తించారు. అహ్మద్ ఐఎస్ఐఎస్ లో తీవ్రవాద మరియు క్రియాశీల సభ్యుడిగా ఉన్నాడు. భారతదేశం మరియు విదేశాలలో సానుభూతిపరుల నుండి ఐఎస్ఐఎస్ సంస్థ కోసం నిధుల సేకరణలో పాల్గొన్నందుకు గాను అతన్ని అరెస్టు చేశారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం అనేక ప్రత్యేక కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాల పోలీసులు నిఘా పెంచడంతో పాటు అప్రమత్తంగా ఉంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =