జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు భారత్ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్, వైస్ కెప్టెన్ గా శిఖర్ ధావన్

BCCI Announces that KL Rahul Cleared to Play ODI Series in Zimbabwe Will Lead the Team India As Captain, KL Rahul Will Lead the Team India As Captain, Zimbabwe ODI Series, ODI series against Zimbabwe, ZIM vs IND 2022, Board of Control for Cricket in India, KL Rahul named captain Team India for the 3 ODI series against Zimbabwe, 3 ODI series against Zimbabwe, Mango News, Mango News Telugu,

ఆగస్టు 18, 20, 22 తేదీల్లో భారత్, జింబాబ్వే జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. జింబాబ్వేతో వన్డే సిరీస్ కు భారత్ జట్టు ప్రకటన సందర్భంగా, రెగ్యులర్ కెప్టెన్ రోహిత్‌ శర్మ గైర్హాజరీ నేపథ్యంలో కెప్టెన్ గా శిఖర్ ధావన్ వ్యవహరించనున్నట్టు బీసీసీఐ వెల్లడించింది. అయితే కెప్టెన్ విషయంలో బీసీసీఐ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. జింబాబ్వేతో సిరీస్‌కు భారత కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్ ను ఎంపిక చేసినట్టు ప్రకటించింది. అలాగే శిఖర్ ధావన్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడని తెలిపారు. ఈ మేరకు బీసీసీఐ గురువారం ఒక ప్రకటన చేసింది.

“బీసీసీఐ మెడికల్ టీమ్ కేఎల్‌ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్‌ ని అంచనా వేసి, జింబాబ్వేలో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌లో ఆడేందుకు అతన్ని క్లియర్ చేసింది. దీంతో ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ కేఎల్‌ రాహుల్ ను జట్టుకు కెప్టెన్‌గా నియమించింది మరియు శిఖర్ ధావన్‌ని అతని డిప్యూటీగా నియమించింది” అని బీసీసీఐ ప్రకటనలో తెలిపింది.

జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగే మూడు మ్యాచుల వన్డే సిరీస్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీలకు విశ్రాంతి కల్పించారు. శ్రేయాస్‌ అయ్యర్‌ కూడా ప్రకటించిన జట్టులో లేడు. కాగా కొంత విరామం అనంతరం ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, పేసర్ దీపక్ చాహర్‌ లు జట్టులో చోటు దక్కించుకున్నారు. అలాగే బ్యాటర్ రాహుల్ త్రిపాఠి కూడా తొలిసారిగా వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నాడు.

జింబాబ్వేతో 3 వన్డేలకు భారత్ జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + one =