న్యూఢిల్లీ ఎయిమ్స్ నూతన డైరెక్టర్ గా డాక్టర్ ఎం.శ్రీనివాస్‌ నియామకం

Dr M Srinivas Appointed as New Director of All India Institute of Medical Sciences New Delhi, Dr.M.Srinivas Appointed As New Director Of New Delhi AIIMS, Dr.M.Srinivas New Delhi AIIMS, Dr.M.Srinivas New Director Of Delhi AIIMS, New Delhi AIIMS, New Delhi AIIMS New Director Dr.M.Srinivas, Dr M Srinivas Named Director Of Aiims, Mango News, Mango News Telugu, Dr M Srinivas Appointed New Director Of AIIMS Delhi, Dr.M.Srinivas on Twitter, Dr M Srinivas Is New Aiims Delhi Director , New Aiims Delhi Director, Aiims Delhi Director, AIIMS Latest News And Updates, All India Institute Of Medical Sciences

న్యూఢిల్లీ లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నూతన డైరెక్టర్ గా డాక్టర్ ఎం.శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఎయిమ్స్ కొత్త డైరెక్టర్ గా డా.ఎం.శ్రీనివాస్‌ నియామకానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్‌ అపాయింట్‌మెంట్‌ కమిటీ (ఏసీసీ) ఆమోదం తెలిపింది. డా.ఎం.శ్రీనివాస్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐసీ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీ డీన్ గా విధులు నిర్వరిస్తున్నారు. ఇప్పటివరకు ఎయిమ్స్ డైరెక్టర్ గా ఉన్న డాక్టర్ రణదీప్ గులేరియా పదవీకాలం నేటితో ముగియనుండడంతో ఆయన స్థానంలో డా.శ్రీనివాస్ నియమితులయ్యారు. ఎయిమ్స్ డైరెక్టర్ పదవికి డాక్టర్ గులేరియా ఇప్పటీకే ఆరునెలల పొడిగింపును పొందారు.

ఇక ఎయిమ్స్ డైరెక్టర్ గా డా.శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి ఐదేళ్ల పాటుగా లేదా 65 ఏళ్ల వయస్సు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు, ఏది ముందుగా వర్తిస్తే అప్పటివరకు కొనసానున్నట్టు నియామక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో డా.శ్రీనివాస్ గతంలో పీడియాట్రిక్ సర్జరీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here