నేడే ఆస్ట్రేలియా, భారత్‌ జట్ల మధ్య కీలకమైన రెండో టీ20 మ్యాచ్, భారత్ జట్టులో మార్పులు?

India vs Australia 2nd T20 Match Today at Vidarbha Stadium Nagpur, India vs Australia 2nd T20I, India vs Australia, 2nd T20I, IND vs AUS 2nd T20I, IND vs AUS 2022, India vs Australia T20 Schedule, Mango News, Mango News Telugu, Ind Vs Aus 2nd T20 2022 Live Streaming, India Vs Australia T20 2022 Playing 11, IND vs AUS, IND vs AUS Playing 11, India vs Australia 2nd T20, India Vs Australia 2nd T20I Live Streaming, India Vs Australia T20I Latest News And Updates, IND vs AUS T20I Live Scores

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నేడు (సెప్టెంబర్ 23, శుక్రవారం) నాగపూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. రాత్రి 7.00 గంటల నుంచి ఈ టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. తోలి టీ20లో ఘన విజయంతో ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా 1-0తో ముందంజలో ఉంది. సిరీస్ పై ఆశలు నిలవాలంటే కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ జట్టు కీలకమైన రెండో టీ20లో మెరుగైన ప్రదర్శన చేసి విజయాన్ని దక్కించుకోవాల్సి ఉంది. ఇటీవల జట్టు భారీ స్కోర్లు సాధిస్తున్నా కూడా చివరిలో తప్పులు చేస్తూ విజయం వద్ద బోల్తా పడుతుండంతో అభిమానుల్లో నిరాశ నెలకుంది.

కాగా ఈ మ్యాచ్‌ లో భారత్ జట్టు తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతోందనే దానిపై అందరిలో ఆసక్తి నెలకుంది. జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వస్తాడా?, వికెట్‌ కీపర్‌ గా దినేశ్‌ కార్తీక్‌ బదులు రిషభ్‌ పంత్‌ కు చోటు దక్కుతుందా?, డెత్‌ ఓవర్లలో నిరాశపరుస్తున్న భువనేశ్వర్‌ కుమార్ ను పక్కన పెడతారా?, దీపక్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్ లకు జట్టులో చోటు దక్కుతుందా అనే దానిపై విస్తృత చర్చ జరుగుతుంది. రెండో టీ20లో కూడా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌, హార్దిక్ పాండ్యా తమ ఫామ్ కొనసాగించి, ఆస్ట్రేలియాపై మంచి విజయంతో సిరీస్‌ను సమం చేయాలని అభిమానులు భావిస్తున్నారు.

ఇక తోలి టీ20లో విజయంతో సిరీస్ కైవసం చేసుకునేందుకు ఆస్ట్రేలియా జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది. కెప్టెన్ ఆరోన్ ఫించ్, కామెరూన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ వేడ్, టిమ్ డేవిడ్ మరోసారి రాణిస్తే భారత్ కు గట్టి పోటీ ఎదురుకానుంది. అలాగే బౌలింగ్‌ విభాగంలో జోష్ హేజిల్‌వుడ్‌, పాట్ కమిన్స్‌, ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్ మరింత మెరుగ్గా రాణించాలని ఆ జట్టు భావిస్తుంది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు ఆధిపత్యం చెలాయించి, విజయాన్ని కైవసం చేసుకోనుందో మరికొద్ది గంటల్లో తేలనుంది.

భారత్ (తుది జట్టు అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, 6 దినేష్ కార్తీక్/రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా/ఉమేష్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్/రవిచంద్రన్ అశ్విన్.

ఆస్ట్రేలియా (తుది జట్టు అంచనా): ఆరోన్ ఫించ్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (వికెట్), పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జాంపా, జోష్ హాజిల్‌వుడ్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here