డిసెంబర్ 4న కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం

YSRTP Merged With Congress On December 4, YSRTP Merged With Congress, YSRTP Merged On December 4, On December 4 YSRTP Merged, YS Sharmila, YSR Telangana Party, YSRTP, Congress, Latest YSRTP Merged News, YSRTP Merged News Update, Latest YSRTP News, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
YS Sharmila, YSR Telangana Party, YSRTP, Congress

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న సమయం ఆసన్నమయింది. కాంగ్రెస్‌లోకి వైఎస్సార్‌టీపీ విలీనానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ మేరకు కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీని విలీనం చేసే విషయంపై ఆ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ 4న కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీని విలీనం చేయనున్నట్లు ప్రకటించారు. మంగళవారం లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో సమావేశమైన షర్మిల.. అనంతరం విలీనంపై క్లారిటీ ఇచ్చారు.

నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే.. కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం కావాల్సి ఉంది. అప్పటికే షర్మిల అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో అనూహ్యంగా విలీన ప్రక్రియ ఆగిపోయింది. ఆ తర్వాత కూడా షర్మిల కాంగ్రెస్ హైకమాండ్‌తో పలుమార్లు మంతనాలు జరిపారు. ఇక రేపో.. మాపో కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం అవుతుందని వార్తలొస్తున్న క్రమంలో.. తాజాగా ఆ వార్తలపై షర్మిల స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు ఈరోజు సాయంత్రం షర్మిల ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం వరకు పార్టీ ముఖ్యనేతలంతా ఢిల్లీకి రావాలని షర్మిల కోరారు.

అటు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కూడా షర్మిలకు పిలుపువచ్చింది. ఈక్రమంలో డిసెంబర్ 4న ఉదయం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో షర్మిల సమావేశం కానున్నారు. ఆ తర్వాత 11 గంటలకు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. అప్పుడే తన వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారు. ప్రస్తుతం షర్మిల వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

ఇక హైకమాండ్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఏపీ పీసీసీ పగ్గాలు షర్మిలకు అప్పగించాలని కాంగ్రెస్ భావిస్తోందట. అయితే షర్మిల ఏపీపీసీసీ పదవి చేపట్టేందుకు నిరాకరిస్తుంటే.. రాహుల్ గాంధీ మాత్రం అధ్యక్ష పదవి చేపట్టాలని పట్టుపడుతున్నారట. చివరికి షర్మిల ఏపీపీసీసీ లేదా ఏపీ కాంగ్రెస్ అడ్వైజర్‌గానైనా బాధ్యతలు స్వీకరించే అవకాశం కనిపిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + nine =