నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేను ప్రశ్నించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

ED Questions Congress Senior Leader Mallikarjun Kharge Today in National Herald Case, ED Questions Congress Senior Leader Mallikarjun Kharge Today, ED Questions Congress Senior Leader Mallikarjun Kharge, ED Questions Congress Senior Leader, ED questions Congress leader Mallikarjun Kharge in National Herald corruption case, ED Questions Congress Leader Mallikarjun Kharge, Enforcement Directorate is questioning senior Congress leader Mallikarjun Kharge in connection with a fresh case, National Herald Case, Enforcement Directorate is questioning Congress leader Mallikarjun Kharge, Enforcement Directorate, Leader of Opposition in Rajya Sabha Mallikarjun Kharge was questioned by the Enforcement Directorate, ED is questioning senior Congress leader Mallikarjun Kharge, National Herald corruption case, National Herald corruption case News, National Herald corruption case Latest News, National Herald corruption case Latest Updates, National Herald corruption case Live Updates, Mango News, Mango News Telugu,

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో ఆ పార్టీ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఒక కీలక కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు హాజరు కావాల్సిందిగా సమన్లు ​​అందుకున్నారు. ‘నేషనల్ హెరాల్డ్’ అవినీతి కేసులో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం విచారించింది. దర్యాప్తులో కొన్ని అంశాలపై స్పష్టత కోరేందుకు ఈడీ ఖర్గే వాంగ్మూలాన్ని మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద నమోదు చేసుకుంది. ఖర్గేకు కాంగ్రెస్ అధినాయకత్వానికి విధేయుడిగా పేరుంది. కేంద్రంలో 2014లో మోదీ ప్రభుత్వం వచ్చాక గత కాంగ్రెస్ ప్రభుత్వం లోని అవినీతిని వెలికితీస్తామని ప్రకటించింది.

దీనిలో భాగంగా ‘నేషనల్ హెరాల్డ్’ పత్రికకు సంబంధించి అవినీతి చోటుచేసుకుందని, దీని వెనుక ఎవరున్నా బయటకు లాగుతామని అప్పట్లో బీజేపీ ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలకు ఉన్న సంబంధాలపై ముడిపడి ఉన్న విచారణ కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోంది. నేషనల్ హెరాల్డ్ ను భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించారు. ఇది కాంగ్రెస్ పార్టీకి అనుకూల పత్రికగా ముద్రపడింది. ఇది అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL)చే ప్రచురించబడింది. అయితే 2010లో, యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (YIL) అనే పేరుతో కొత్త కంపెనీ దీనిని స్వాధీనం చేసుకుంది. ఈ ప్రక్రియలో అవినీతి చోటుచేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ అధినాయకత్వం ఖండించింది.

ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని నిందితులుగా చేర్చారు. వారిలో మోతీలాల్ వోరా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శామ్ పిట్రోడా మరియు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నారు. వీరందరూ ఈ కంపెనీకి సంబంధించిన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని బిజెపికి చెందిన సుబ్రమణ్యస్వామి ఢిల్లీ హైకోర్టులో చేసిన ఫిర్యాదు చేశారు. సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ మరికొందరు కలిసి కేవలం రూ. 50 లక్షలు చెల్లించి నిధుల దుర్వినియోగానికి కుట్ర పన్నారని, దీని ద్వారా ఎజెఎల్ కాంగ్రెస్‌కు బకాయిపడిన రూ. 90.25 కోట్లను తిరిగి పొందే హక్కును వైఐఎల్ పొందిందని స్వామి ఆరోపించారు. దీనిపై కోర్ట్ విచారణకు ఆదేశించింది. కాగా ఇటీవల కాలంలో మల్లికార్జున్ ఖర్గే బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, అందుకే ఆయనను ఈడీ ప్రశ్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 1 =