త్వరలో కాంగ్రెస్ పార్టీ‌లో చేరనున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్?

Election Strategist Prashant Kishor Likely To Join Congress Party Very Soon, Election Strategist Prashant Kishor likely to join Congress in next few days, Prashant Kishor Likely To Join Congress Party Very Soon, Election Strategist Prashant Kishor likely to join Congress as advisor, Election Strategist Prashant Kishor will join Congress, Election Strategist Prashant Kishor The kingmaker likely to join Congress in next few days, Election Strategist Prashant Kishor, Election Strategist, Prashant Kishor, Prashant Kishor Likely To Join Congress Party as advisor, Election Strategist Prashant Kishor Ready to Join Congress, Congress Party advisor, Congress Party, Election Strategist Prashant Kishor News, Election Strategist Prashant Kishor Latest News, Election Strategist Prashant Kishor Latest Updates, Election Strategist Prashant Kishor Live Updates, Mango News, Mango News Telugu,

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ త్వరలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ‌లో చేరే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. వరుసగా రెండు రోజుల పాటు కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చలు జరిపిన తరువాత ప్రశాంత్ కిషోర్ మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ మేరకు మరో రెండు వారాల్లో సోనియా గాంధీతో జరగనున్న భేటీలో దీనిపై తుది నిర్ణయం వెలువడనుందని భావిస్తున్నారు. గత వారం తన మొదటి సమావేశంలో ప్రశాంత్ కిషోర్.. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ వాద్రాను కూడా కలిసి మాట్లాడారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రధాన పోటీ ఇవ్వగలిగేలా కాంగ్రెస్ పార్టీని తయారు చేయటం కోసం అనుసరించాల్సిన వ్యహాలపై ప్రశాంత్ కిషోర్ తన ప్రణాళికను తెలియజేశారు. రాష్ట్రాలతో పాటు రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అమలుచేయాల్సిన ప్రణాళికా వ్యూహాన్ని వివరిస్తూ ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు ప్రశాంత్ కిషోర్.

కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రశాంత్ కిషోర్ అందించిన సుమారు 600 స్లైడ్‌లను అగ్రనాయకత్వం పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పూర్వ వైభవం కోసం పార్టీని కింది స్థాయి నుంచీ పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన అధినాయకత్వానికి సూచించారు. ఆయన ఇచ్చిన సూచనల ప్రకారం.. సోనియా గాంధీని కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగాలి. అలాగే రాహుల్ గాంధీని పార్లమెంటరీ బోర్డు చీఫ్‌గా నియమించాలి. ఇక మరో ముఖ్యమైన వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా వైస్ ప్రెసిడెంట్‌గా యువకులను ఎంచుకోవాలి. అప్పుడే పార్టీశ్రేణులకు కూడా కొత్త ఉత్తేజం వస్తుందని.. తద్వారా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ దేశవ్యాప్తంగా పార్టీ విజయం అందుకోవడానికి సహకరిస్తాయని ప్రశాంత్ కిషోర్ సూచించారు. పార్టీలోని ముఖ్యనేతల అభిప్రాయాలను కూడా తీసుకున్న తర్వాత ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరే విషయమై నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + twenty =