ఈజిప్ట్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విస్తృత చర్చలు

PM Modi Holds Discussions with Egypt President Abdel Fattah El-Sisi at Hyderabad House,PM Modi Holds Discussions,Egypt President Abdel Fattah El-Sisi,Abdel Fattah El-Sisi at Hyderabad House,Mango News,Mango News Telugu,Abdel Fattah Al-Sisi Religion,Abdel Fattah El-Sisi Net Worth,Abdel Fattah El-Sisi Iq,Aya El-Sisi,Abdel Fattah El-Sisi President Of Egypt,Facts About Abdel Fattah El-Sisi,Abdel Fattah El-Sisi Email Address,Abdel Fattah El-Sisi Salary,Egyptian President Abdel Fattah El-Sisi

దేశంలో గురువారం జరగనున్న 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫతేహ్ ఎల్-సీసీ పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ చేరుకున్న ఈజిప్ట్ అధ్యక్షుడికి బుధవారం ఉదయం రాష్ట్రపతి భవన్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫతేహ్ ఎల్-సీసీ మాట్లాడుతూ, భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా పాల్గొనడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అలాగే రాజ్ ఘాట్ వద్దకు చేరుకొని, జాతిపిత మహాత్మ గాంధీకి పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు.

అనంతరం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోదీ, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫతేహ్ ఎల్-సీసీ సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ, కల్చర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, యూత్ మ్యాటర్స్, బ్రాడ్‌కాస్టింగ్ రంగాల్లో భారత్, ఈజిప్ట్ మధ్య అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదిరాయి. సమావేశం ఇరువురూ నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదం మానవాళికి అత్యంత తీవ్రమైన భద్రతా ముప్పు అని, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం వ్యాప్తి చెందడం పట్ల భారత్, ఈజిప్ట్ ఆందోళన చెందుతున్నాయన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయని చెప్పారు. రక్షణ రంగంలో ఇరు దేశాలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని మోదీ అన్నారు. భారత్-ఈజిప్టు వ్యూహాత్మక భాగస్వామ్యం రాజకీయ, రక్షణ మరియు శాస్త్రీయ అభివృద్ధికి నాంది కాగలదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సీసీ మాట్లాడుతూ, తమ దేశంలో పెట్టుబడులకు గొప్ప అవకాశాలు ఉన్నందున ఈజిప్ట్ లో భారతీయ కంపెనీల పెట్టుబడులను పెంచేందుకు చర్చలు జరిగాయన్నారు. వాణిజ్యం, పెట్టుబడుల రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవడం, ఉగ్రవాదం, రాడికలైజేషన్‌పై పోరాటం, ఈజిప్ట్‌-భారత్‌ల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించడంపై చర్చ జరిగినట్లు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 17 =