అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి వేగంగా ఏర్పాట్లు

Quick Arrangements For The Opening Ceremony Of Ayodhya Ram Mandir, Opening Ceremony Of Ayodhya Ram Mandir, Quick Arrangements Of Ayodhya Ram Mandir Opening Ceremony, Arrangements Of Opening Ceremony Of Ayodhya Ram Mandir, Ayodhya Ram Mandir Opening Ceremony, Ayodhya,The time is near to the great event, Quick arrangements, Latest Ayodhya Ram Mandir News, Ayodhya Ram Mandir Updates, Ayodhya Ram Mandir, Ayodhya Ram Mandir News, Latest Ayodhya News, Mango News, Mango News Telugu
Ayodhya,The time is near to the great event, Quick arrangements, opening ceremony of Ayodhya Ram Mandir

ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫైజాబాద్ జిల్లాలో శరవేగంగా మహాఘట్టానికి నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. దీంతో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. 2024 జనవరి 22న జరిగే ఈ మహాఘట్టానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు. వీరితో పాటు వివిధ వర్గాలకు చెందిన 400 మంది సాధువులకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి.

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో.. రామ్ లల్లా విగ్రహాల ప్రతిష్టాపనతో పాటు ఎన్నో కార్యక్రమాల్ని అయోధ్య రామ మందిర ట్రస్ట్ ప్లాన్ చేస్తోంది.దీనికోసం అన్ని సంప్రదాయాలకు చెందిన 400 మంది సాధువులకు ఇప్పటికే ఆహ్వానాలు పంపినట్లు తెలిపింది. వీరితో పాటు దేశ ప్రతిష్టను ఇనుమడింపచేస్తున్న కొంతమంది ప్రముఖులకు కూడా ఆహ్వానాలు పంపామని.. మరికొన్ని త్వరలో పంపుతున్నట్లు చెప్పింది. అలాగే అయోధ్యలో జరుగుతున్న ఏర్పాట్ల గురించి కూడా  ట్రస్ట్ ప్రతినిధులు వివరించారు.

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం కోసం.. ఆ ప్రాంతంలో తీర్ధక్షేత్రపురం నిర్మిస్తున్నట్లు ట్రస్ట్ తెలిపింది. ఇందులో 6 గొట్టపు బావులు, 6 వంటశాలలు నిర్మిస్తున్నట్లు  చెప్పింది. అంతేకాదు  పది పడకల హాస్పిటల్ నిర్మించి… అందులో 150 మంది డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొంది. ఈ డాక్టర్లను దేశంలోని వివిధ ప్రదేశాల నుంచి రప్పిస్తున్నట్లు  తెలిపింది. అలాగే రామాలయం ప్రారంభానికి వచ్చే లక్షలాది భక్తుల కోసం భోజన ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేస్తున్నట్లు ట్రస్ట్ వివరించింది.

అలాగే ఈ మహా ఘట్టానికి శంకరాచార్యులు, మహేమండలేశ్వరులు, సిక్కు, బౌద్ధ ఆధ్యాత్మిక గురువులు వస్తారని  ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వామినీ నారాయణ్, గాయత్రీ పరివార్,వివిధ మీడియా సంస్ధల ప్రతినిధులు, క్రీడాకారులు, రైతులకు  కూడా ఆహ్వానం పలుకుతున్నట్లు పేర్కొన్నారు. శిల్పులయిన గణేష్ భట్, అరుణ్ యోగిరాజ్, సత్యనారాయణ్ పాండే చెక్కిన రామ్ లల్లా విగ్రహాలను ఆరోజు ప్రతిష్టిస్తామని ట్రస్ ప్రతినిధులు తెలిపారు. నిజానికి  రామ మందిర ప్రారంభోత్సవానికి అసలు కార్యక్రమం జనవరి 22నే అయినా దీనికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు మాత్రం జనవరి 16 నుంచే ప్రారంభమవుతాయని వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 11 =