మహారాష్ట్ర: ఆసుపత్రి ఐసీయూ యూనిట్ లో భారీ అగ్నిప్రమాదం, 10 మంది మృతి

10 dead 7 injured as fire breaks out in Maharashtra hospital, 10 Patients Die In Fire At Covid Ward, 10 Patients Die In Fire At Covid Ward In Maharashtra Hospital, 10 patients killed as huge fire breaks out in ICU, 11 Covid-19 patients killed in Ahmednagar hospital fire, Fire Breaks Out at ICU Unit of Civil Hospital, Fire Breaks Out at ICU Unit of Civil Hospital in Maharashtra, Fire Breaks Out at ICU Unit of Civil Hospital in Maharashtra 10 People Died, Maharashtra Hospital, Mango News, Ten die in Ahmednagar after fire breaks out in ICU

మహరాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఓ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అహ్మద్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రి ఐసీయూ యూనిట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 10 మంది కరోనా బాధితులు మరణించారు. అలాగే ఈ ఘటనలో పలువురు గాయపడగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయానికి ఐసీయూలో 25 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.

మరోవైపు ఈ ప్రమాదఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ అగ్నిప్రమాద ఘటనలో 10 మంది కరోనా పేషంట్స్ మరణించడం పట్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు జరిపించాలని అధికారులను సీఎం ఉద్ధవ్ థాకరే ఆదేశించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 11 =